ఆంటీగ్వాలో అదృశ్యమైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కోసం విస్తృత గాలింపు, క్యూబా చెక్కేశాడని అనుమానిస్తున్న పోలీసులు

కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా, బర్ముడా పౌరసత్వం పొంది ఇంతకాలం ఇక్కడే ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యం వార్త సంచలనం రేపింది.

ఆంటీగ్వాలో అదృశ్యమైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ  కోసం విస్తృత గాలింపు,  క్యూబా చెక్కేశాడని అనుమానిస్తున్న పోలీసులు
Mehul Choksi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 25, 2021 | 12:12 PM

కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా, బర్ముడా పౌరసత్వం పొంది ఇంతకాలం ఇక్కడే ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యం వార్త సంచలనం రేపింది. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకును 13000 కోట్లకు పైగా మోసగించి పరారై వాంటెడ్ లిస్టులో ఉన్న ఈయన గత ఆదివారం ఆంటిగ్వా నుంచి అదృశ్యమయ్యాడు. కానీ ఈ మిస్సింగ్ వార్త వదంతి కూడా అయివుంటుందని, ఏమైనా నిజంగా కనబడకుండా పోయాడా అన్న విషయమై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని పోలీస్ కమిషనర్ అట్లీ రోడ్నే తెలిపారు. ఈ నెల 23 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మెహుల్ చోక్సీ చివరిసారిగా తన ఇంటి నుంచి కారులో వెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత ఆయన కనబడలేదు. మెహుల్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఇతనికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరామని ఆంటిగ్వా ప్రధాని గౌస్టన్ బ్రౌన్ చెప్పారు. బహుశా ఇతగాడు క్యూబా కి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. ఆ దేశంలోనూ ఇతనికి ఆస్తులు ఉన్నాయి. అక్కడి ఖరీదైన విల్లాలో ఇతగాడు ఉన్నట్టు తెలుస్తోంది. మెహుల్ సన్నిహితులు చూచాయగా ఈ విషయం చెప్పారు. కరేబియాలోని మరో దేశంలోనూ ఇతనికి పౌరసత్వం ఉంది. మెహుల్ చోక్సీ బందువైన నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా మెహుల్ ని ఇండియాకు అప్పగించాలని భారత అధికారులు కోరుతున్నారని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆంటిగ్వా ప్రధాని ఇదివరకే ప్రకటించారు. ఇక్కడి చట్టాల మేరకు అతనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: AP: అనంతపురం జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం..

PPF Account: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!