MEIL: విపత్తు వేళ తమిళనాడుకు మేఘా ఆపన్న హస్తం.. 72 గంటల్లోనే 5వందల బెడ్స్‌‌తో ఆస్పత్రి ఏర్పాటు

MEIL: తమిళనాడు మేఘా సాయం... విపత్తు వేళ ఆపన్న హస్తంతో ఊపిరి అందిస్తోంది. మనో ధైర్యం నింపుతోంది. తమిళనాడు వ్యాప్తంగా 3వేల బెడ్స్‌ ఏర్పాటుకు...

MEIL: విపత్తు వేళ తమిళనాడుకు మేఘా ఆపన్న హస్తం.. 72 గంటల్లోనే 5వందల బెడ్స్‌‌తో ఆస్పత్రి ఏర్పాటు
Megha Engineering And Ingrastructures Limited Group
Follow us
Sanjay Kasula

|

Updated on: May 27, 2021 | 12:40 PM

తమిళనాడు మేఘా సాయం… విపత్తు వేళ ఆపన్న హస్తంతో ఊపిరి అందిస్తోంది. మనో ధైర్యం నింపుతోంది. తమిళనాడు వ్యాప్తంగా 3వేల బెడ్స్‌ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది. 72 గంటల్లోనే 5వందల బెడ్స్‌ సిద్ధం చేసి రికార్డు సృష్టించిన మేఘా సంస్థ మరికొన్ని రోజుల్లోనే మిగతా బెడ్స్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

మధురైలో ఏర్పాటు చేసిన ఈ 500 బెడ్స్‌ మే 21న ప్రారంభమయ్యాయి. ఈ బృహత్ కార్యక్రమానికి తమిళనాడు ప్రభుత్వం, క్రెడాయ్‌, జీ స్క్వేర్‌ రియల్టర్స్ సంస్థ సహకారం అందిస్తోంది. చెన్నై సహా తమిళనాడులోని చాలా జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్స్‌ ఏర్పాటుకు చరుగ్గా పనులు సాగుతున్నయి.

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు మేఘా సాయం అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ అందిస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి క్రయోజినిక్ ట్యాంకులు తెప్పించింది. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది.

ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా… ఆక్సిజన్ కొరత కారణంగా ఏం చేయలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి సాయం చేసింది మెఘా సంస్థ. అలాంటి క్లిష్టసమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలిచింది మేఘా ఇంజనీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌. బీ టైప్‌ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేసింది. పెరుగుతున్న రోగులతో పోల్చుకుంటే ఆక్సిజన్ సరిపోవడం లేదని… అందుకే ప్రాణవాయువుతోపాటు ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు  చేస్తోంది మేఘా సంస్థ.

ఇవి కూడా చదవండి :  Sonu Sood: యాంకర్‌ వింధ్యా విశాఖను ప్రశంసించిన సోనూసూద్.. ఎందుకో తెలుసా..?

Amazon New CEO Andy Jassy: అమెజాన్‌ కొత్త సీఈవో ఖరారు.. జూలై 5న సీఈవో పదవి నుంచి తప్పుకుంటానన్న జెఫ్ బెజోస్