గుండు సీక్రెట్ చెప్పిన మెగాస్టార్

చిరంజీవి గుండుతో క‌నిపిస్తూ అభిమానుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసిన సంగతి తెలిసిందే. మ‌రి ఈ కొత్త లుక్ వెనుకున్న ఫజిల్‌ను విప్పేశారు. ఆ న్యూ లుక్ వెనక ఉన్న రహస్యన్ని తన అభిమానులతో  చెప్పేశారు....

గుండు సీక్రెట్ చెప్పిన మెగాస్టార్
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 25, 2020 | 7:36 AM

Chiranjeevi Reveals : చిరంజీవి గుండుతో క‌నిపిస్తూ అభిమానుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసిన సంగతి తెలిసిందే. మ‌రి ఈ కొత్త లుక్ వెనుకున్న ఫజిల్‌ను విప్పేశారు. ఆ న్యూ లుక్ వెనక ఉన్న రహస్యన్ని తన అభిమానులతో  చెప్పేశారు. చిరు నున్న‌టి గుండుతో అర్బ‌న్ మాంక్ లో క‌నిపించిన ఫొటో నెట్టింట్లో తెగ వైర‌ల్ అయింది.

అయితే ఎప్పుడూ క‌నిపించ‌ని విధంగా డిఫ‌రెంట్ గా క‌నిపించ‌డంతో చిరు..త‌న కొత్త చిత్రం ఆచార్య కోసం ఈ గెట‌ప్ వేసుకున్నాడా..అని అభిమానులు పెద్ద చర్చ మొదలు పెట్టారు. అయితే గుండు బాస్ గెట‌ప్ వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పారు.

ఓ  ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆ విషయాన్ని బయట పెట్టారు. ఈ తన గెట‌ప్ ఆచార్య సినిమా కోసం కాద‌ని, వేదాళ‌మ్ రీమేక్ కోసం చేసిన ట్ర‌య‌ల్ లుక్ షూట్ అని చెప్పారు.

వేదాళమ్‌ సెకండ్ ఆఫ్ కోసం ఈ లుక్ ను ప్ర‌య‌త్నించి చూశార‌ట‌. వేదాళమ్ రీమేక్ ను మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేయ‌నున్నార‌ని తెలిపారు. కొరటాల శివ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య షూటింగ్ లాక్ డైన్ ఎఫెక్ట్ తో నిలిచిపోగా.. న‌వంబ‌ర్ లో రీస్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.