డిప్యూటీ సీఎం ఆరోగ్యం విషమం
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆయనను హుటాహుటీన ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్, డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిపాలైన డిప్యూటీ సీఎం ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో ఆయన్ను సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, సిసోడియా కరోనా లక్షణాలతో 23 న ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన […]
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆయనను హుటాహుటీన ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్, డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిపాలైన డిప్యూటీ సీఎం ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో ఆయన్ను సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, సిసోడియా కరోనా లక్షణాలతో 23 న ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన ప్రకారం కరోనా పరీక్ష చేయించుకోగా అతనికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు సిసోడియా ఆరోగ్య పరిస్థిని సమీక్షిస్తున్నారు.