మెగా మల్టీస్టారర్‌కు.. చిరు గ్రీన్ సిగ్నల్..!

తెలుగులో వచ్చిన అక్కినేని మల్టీస్టారర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మెగా మల్టీస్టారర్ మూవీ వస్తే.. మెగా అభిమానులందరికీ పండగే. మెగా సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కనిపించే మెగా హీరోలందరూ కలిసి ఒకే మూవీలో కనిపిస్తే అద్బుతంగా ఉంటుంది. అక్కినేని మల్టీస్టారర్ మూవీ వచ్చినప్పటి నుంచి మెగా మల్టీస్టారర్ మూవీ ఎప్పుడొస్తుండా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయంలో వచ్చేసింది. మెగా మల్లీస్టారర్‌కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తనయుడు రామ్ […]

మెగా మల్టీస్టారర్‌కు.. చిరు గ్రీన్ సిగ్నల్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 08, 2019 | 1:22 PM

తెలుగులో వచ్చిన అక్కినేని మల్టీస్టారర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మెగా మల్టీస్టారర్ మూవీ వస్తే.. మెగా అభిమానులందరికీ పండగే. మెగా సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కనిపించే మెగా హీరోలందరూ కలిసి ఒకే మూవీలో కనిపిస్తే అద్బుతంగా ఉంటుంది. అక్కినేని మల్టీస్టారర్ మూవీ వచ్చినప్పటి నుంచి మెగా మల్టీస్టారర్ మూవీ ఎప్పుడొస్తుండా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయంలో వచ్చేసింది. మెగా మల్లీస్టారర్‌కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటిస్తే.. ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తే అంతే ఆనందంగా ఉంటుందని సైరా సక్సస్ ఈవెంట్‌లో చిరు చెప్పుకొచ్చారు. గతంలో రామ్ చరణ్, మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో చిరు స్రీన్‌లో కనిపించారు. అయితే అవి ఫుల్ లెన్త్ కాదు.. ఇప్పుడు వీరిద్దరితో పాటు మెగా హీరోలందరూ ఒకే మూవీలో కనిపించనున్నారు. ఖైదీ నెంబర్ 150తో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన చరణ్ సైరా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తండ్రితో వరుసగా రెండు హిట్‌లను అందుకున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా.. ఇటీవల ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే కీలకపాత్రలో నటించారు.

అయితే ఈ సినిమా రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ చేజిక్కించుకోవడంతో రామ్ చరణ్, చిరంజీవి నటించే మల్టీస్టారర్ మూవీ ఇదే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మరోవైపు చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుందని సమాచారం. ఇక వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.