మొబైల్ ఫోన్లపై భారీ ఆఫర్లు… అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్!
అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ద్వారా వినియోగదారులపై మునుపెన్నడూ లేని ఆఫర్లను కురిపించిన అనంతరం ఇప్పుడు మళ్లీ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరిట మరో ఆఫర్ సేల్ ను అమెజాన్ ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా వివిధ బ్రాండ్లకు చెందిన మొబైల్స్ ను తగ్గింపు ధరలకే అందించనుంది. ఈ సేల్ అక్టోబర్ 9 వరకు జరగనుంది. ఈ సేల్ లో ఎక్స్ చేంజ్ ఆఫర్లు, వివిధ బ్యాంకు కార్డులతో చేసే కొనుగోళ్లపై ప్రత్యేక […]
అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ద్వారా వినియోగదారులపై మునుపెన్నడూ లేని ఆఫర్లను కురిపించిన అనంతరం ఇప్పుడు మళ్లీ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరిట మరో ఆఫర్ సేల్ ను అమెజాన్ ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా వివిధ బ్రాండ్లకు చెందిన మొబైల్స్ ను తగ్గింపు ధరలకే అందించనుంది. ఈ సేల్ అక్టోబర్ 9 వరకు జరగనుంది. ఈ సేల్ లో ఎక్స్ చేంజ్ ఆఫర్లు, వివిధ బ్యాంకు కార్డులతో చేసే కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కేవలం మొబైల్స్ పైనే మొబైల్ యాక్సెసరీలు, ఫోన్ కేసులు, కవర్లు, కేబుళ్లు, బ్లూటూత్ హెడ్ సెట్లపై ఈ ఆఫర్లు ఉండనున్నాయి.
ఈ సేల్ లో కేవలం టాప్ ఎండ్ మోడల్స్ పైనే కాకుండా ప్రారంభ స్థాయిలో ఉన్న మొబైల్స్ పై కూడా ధరల తగ్గింపు లభిస్తుందండోయ్! రూ.5,999 విలువ చేసే రెడ్ మీ 7ఏ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.4,999గానూ, రూ.6,199 విలువ చేసే 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.5,799గానూ నిర్ణయించారు. ఈ తగ్గింపు ధర కేవలం అమెజాన్ లోనే కాకుండా ఎంఐ.కామ్ లో కూడా లభించనుంది.
అంతేకాకుండా, రూ.14,999 విలువ చేసే హానర్ 20ఐ ధరను రూ.11,999గా నిర్ణయించారు. వివో వీ15 కూడా ఎమ్మార్పీ కంటే రూ.4,000 తక్కువగా రూ.15,990కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.19,990గా ఉంది. రూ.16,990 విలువ చేసే ఒప్పో ఏ7 మొబైల్ ధరను రూ.7,000 తగ్గించి రూ.9,990కే అందించనున్నారు. సాధారణ డిస్కౌంట్లు మాత్రమే కాకుండా, ఈ సేల్ లో ఫోన్లు కొనుగోలు చేసిన వారిపై డిస్కౌంట్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు కూడా లభించనున్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ లావాదేవీలు చేసిన వారికి పది శాతం(రూ.2,000 వరకు) అదనపు తగ్గింపు లభించనుంది.