ఆటో నడుపుతున్న సీరియల్ నటి.. ఎవరో తెలిస్తే షాక్..

సీరియల్, సినిమాల్లో నటించే వారంటే మనం ఏదో అనుకుంటాం. బయట కాలు పెడితే కారుల్లో తిరుగుతారని, అద్దాల మేడల్లో నివశిస్తారని అనుకుంటాం. కాని అలాంటి ఛాన్స్ అందరికి రాదు. వారు కూడా సాధారణ మనుషులే. రోజువారి జీతాలు తీసుకునే కొంతమంది నటీనటులకు ప్రతిరోజు షూటింగులు ఉండవు. ఉన్న రోజులు డబ్బులు వస్తాయి. లేని రోజు పూట గడవడం కష్టమే. దీంతో వారిలో కూడా చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటివారు షూటింగ్‌లనే నమ్ముకోకుండా ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న […]

ఆటో నడుపుతున్న సీరియల్ నటి.. ఎవరో తెలిస్తే షాక్..
Anil kumar poka

|

Jun 13, 2019 | 12:18 PM

సీరియల్, సినిమాల్లో నటించే వారంటే మనం ఏదో అనుకుంటాం. బయట కాలు పెడితే కారుల్లో తిరుగుతారని, అద్దాల మేడల్లో నివశిస్తారని అనుకుంటాం. కాని అలాంటి ఛాన్స్ అందరికి రాదు. వారు కూడా సాధారణ మనుషులే. రోజువారి జీతాలు తీసుకునే కొంతమంది నటీనటులకు ప్రతిరోజు షూటింగులు ఉండవు. ఉన్న రోజులు డబ్బులు వస్తాయి. లేని రోజు పూట గడవడం కష్టమే. దీంతో వారిలో కూడా చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటివారు షూటింగ్‌లనే నమ్ముకోకుండా ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, ఓ సిరియల్ నటి ఆటో నడుపుతూ ఉపాధి పొందుతోంది.

పేరు సూపర్ లక్ష్మీ. ముంబయిలో నివసిస్తోంది. పగటి సమయంలో సీరియల్స్ లో నటిస్తూ.. సాయంత్రం, రాత్రి వేళల్లో ఆటో నడుపుతోంది. మరాఠీలోని ఎన్నో సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి నిరాడంబరంగా జీవిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అయితే తను ఆటో నడుపుతున్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. అత్తారింటికి దారేది సినిమాలో సహాయ నటుడు బోమర్ ఇరానీ ఆమెలోని రెండో వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. తాను ఓ సూపర్ లేడీని కలిశానని.. ఆమె మరాఠీ సీరియళ్లలో నటిస్తోందని చెప్పారు. అంతేకాదు, రాత్రి వేళ్లలో ఆటో కూడా నడుపుతోందని.. మీకు కూడా ఆమె ఆటోలో ప్రయాణించే అవకాశం దక్కుతుందని భావిస్తున్నానని అన్నాడు. ఆమె నిజజీవితంలో పోషిస్తున్న ద్విపాత్రాభినయాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఆమె ప్రత్యేకత గురించి రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో ఆటోలో ప్రయాణించిన వీడియోను షేర్ చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అటు నటనను ఇటు బాధ్యతలను ఒంటి చేత్తో బ్యాలెన్స్ చేస్తున్న ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu