AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిల మిస్సింగ్.. ఏమిటీ మిస్టరీ..?

అమ్మాయిలు మిస్సింగ్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల కిడ్నాపులు జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేదు. చిన్నా పెద్దా తేడా లేదు. హైదరాబాద్ నగర శివారుల్లో మిస్సింగ్ కేసులు రోజు రోజుకి ఎక్కువై పోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో 500 మందికి పైగా కనిపించకుండా పోయారని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా పఠాన్‌చెరులో ఒకే రోజు ముగ్గురు అమ్మాయిలు కనిపించడకుండా పోవడం కలకలం రేపుతోంది. మిస్సైన వారిలో […]

అమ్మాయిల మిస్సింగ్.. ఏమిటీ మిస్టరీ..?
Anil kumar poka
|

Updated on: Jun 13, 2019 | 12:07 PM

Share

అమ్మాయిలు మిస్సింగ్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల కిడ్నాపులు జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేదు. చిన్నా పెద్దా తేడా లేదు. హైదరాబాద్ నగర శివారుల్లో మిస్సింగ్ కేసులు రోజు రోజుకి ఎక్కువై పోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో 500 మందికి పైగా కనిపించకుండా పోయారని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా పఠాన్‌చెరులో ఒకే రోజు ముగ్గురు అమ్మాయిలు కనిపించడకుండా పోవడం కలకలం రేపుతోంది. మిస్సైన వారిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినిలు, ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉన్నారు. కాలేజీకి వెళుతున్నామని చెప్పిన ఇద్దరు అమ్మాయిలు, ఇంటర్వ్యూకి వెళుతున్నానని చెప్పిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కనిపించకుండా పోయారు. అయితే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారంటూ పలు వార్తా పత్రికల్లో, టీవీ ఛానళ్లలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలు, అమ్మాయిలు తప్పిపోతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పారు. ఈ మిస్సింగ్‌ కేసుల్లో చాలా వరకు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, పరీక్షలు తప్పడం లాంటి వివిధ కారణాలతో ఇంటిని విడిచిపెట్టి వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకూ నమోదైన అన్ని మిస్సింగ్ కేసుల్లో 85 శాతానికి పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన కేసుల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాల ద్వారా ప్రజలను భయాందోళనలకు గురిచేసే అసత్య ప్రచారాలు చేయోద్దని.. అలాంటి ప్రచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Follow Us