AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక తెలంగాణపై కన్నేసిన కమలదళం

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. కాంగ్రెస్, టీడీపీలోని సీనియర్ నేతలే టార్గెట్‌గా కమలదళం పావులు కదుపుతుంది. హైదరాబాద్‌లో మకాం వేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో.. ఇప్పటికే తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరికపై ఆయనతో చర్చించినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా.. కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం వెలువడుతోంది. ఇక టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ […]

ఇక తెలంగాణపై కన్నేసిన కమలదళం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2019 | 11:03 AM

Share

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. కాంగ్రెస్, టీడీపీలోని సీనియర్ నేతలే టార్గెట్‌గా కమలదళం పావులు కదుపుతుంది. హైదరాబాద్‌లో మకాం వేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో.. ఇప్పటికే తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరికపై ఆయనతో చర్చించినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా.. కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం వెలువడుతోంది. ఇక టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు కూడా బీజేపీ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం. దీంతో పాటు తెలంగాణ ద్వితీయ శ్రేణి కేడర్ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు.

Follow Us