బీహార్ లోని ముంగేరీలో హింస, కాల్పులు, ఒకరి మృతి

బీహార్ లోని ముంగేరీలో  మంగళవారం దుర్గాదేవి నిమజ్జనోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, పలువురు గాయపడ్డారు.  రెచ్చి పోయిన గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.  సంఘ విద్రోహశక్తులు ఖాకీలపై రాళ్లు రువ్వారు. గుంపులో ఎవరో కాల్పులు జరపడంతో ఒకరు మరణించినట్టు పోలీసులు చెప్పారు.కాగా-  దుండగుల రాళ్ళ దాడిలో సుమారు 20 మంది పోలీసులు గాయపడ్డారు. ఘటనా స్థలంలో మూడు పిస్టల్స్, బులెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఖాకీలు తెలిపారు.  అటు-మృతుడిని […]

  • Umakanth Rao
  • Publish Date - 6:14 pm, Tue, 27 October 20
బీహార్ లోని ముంగేరీలో హింస, కాల్పులు, ఒకరి మృతి

బీహార్ లోని ముంగేరీలో  మంగళవారం దుర్గాదేవి నిమజ్జనోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, పలువురు గాయపడ్డారు.  రెచ్చి పోయిన గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.  సంఘ విద్రోహశక్తులు ఖాకీలపై రాళ్లు రువ్వారు. గుంపులో ఎవరో కాల్పులు జరపడంతో ఒకరు మరణించినట్టు పోలీసులు చెప్పారు.కాగా-  దుండగుల రాళ్ళ దాడిలో సుమారు 20 మంది పోలీసులు గాయపడ్డారు. ఘటనా స్థలంలో మూడు పిస్టల్స్, బులెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఖాకీలు తెలిపారు.  అటు-మృతుడిని అనురాగ్ పొద్దార్ గా గుర్తించామన్నారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు ముంగేరీ ఇలా ఉద్రిక్తంగా మారింది.