ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ పందెం..!

మిత్రుల మధ్య సరదా పందెం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం బాటిల్‌లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పెందెంలో ఒకరు మృతి చెందారు.

ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ పందెం..!
Follow us

|

Updated on: Oct 24, 2020 | 10:39 AM

మిత్రుల మధ్య సరదా పందెం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం బాటిల్‌లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పెందెంలో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎస్‌ సాయిలు (40) తన ఐదుగురు మిత్రులతో కలిసి పట్టణ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. చేనులో అందరు కలిసి మద్యం సేవిస్తుండగా, మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన పెరిగి బెట్టింగ్‌కు దిగారు. సోడా, వాటర్ కలుపుకోకుండా ఫుల్ బాటిల్ తాగేందుకు పందెం కాశారు. అప్పటికీ మద్యం మత్తులో ఉన్న సాయిలు అతని స్నేహితుడు.. ఇందుకు ఒకే అనేశాడు.

ఇరువురు సోడా, నీరు కలపకుండా ఫుల్‌ బాటిల్‌ సేవించారు. ఇరువురు మత్తులోకి జారిపోగా తోటి మిత్రులు వీరిని ఇళ్లకు పంపించారు. అయితే, సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నారు. అనంతరం స్పృహ కోల్పోవడంతో అతన్ని కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు.

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి