మహారాష్ట్రలో మరింత పెరిగిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 5,182 పాజిటివ్ కేసులు, 115 మరణాలు..
మహారాష్ట్రలో కరోనా మహా విజృంభణ కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ కొత్త కేసులు పుంజుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది...
Maharashtra Reports : మహారాష్ట్రలో కరోనా మహా విజృంభణ కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ కొత్త కేసులు పుంజుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, రెండంకెల సంఖ్యల్లో మరణాలు నమోదవుతున్నాయి.
బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,182 పాజిటివ్ కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,37,358కు, మరణాల సంఖ్య 47,472కు పెరిగింది. కాగా, వైరస్ ధాటికి తాళలేక ఒక్కరోజే 50 మంది ప్రాణాలొదిలారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,80,208కు చేరకుందని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇక మరోవైపు గత 24 గంటల్లో 8,066 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 17,03,274కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,535 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.