గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ లెక్క తేలింది…పోలింగ్ పర్సంటేజ్‌పై క్లారిటీ..గతంలోకంటే స్వల్పంగా పెరిగిందంటున్న అధికారులు

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ లెక్క తేలింది. పోలింగ్ పర్సంటేజ్ పై స్పష్టత వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి... మరికొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ లెక్క తేలింది...పోలింగ్ పర్సంటేజ్‌పై క్లారిటీ..గతంలోకంటే స్వల్పంగా పెరిగిందంటున్న అధికారులు
Follow us
Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2020 | 9:20 AM

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ లెక్క తేలింది. పోలింగ్ పర్సంటేజ్ పై స్పష్టత వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకుగాను 149 డివిజన్లలో నిన్న పోలింగ్‌ జరిగింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో ఎన్నికల గుర్తులు తారుమారు కావడంతో ఎన్నికలు ఈనెల 3వ తేదీన నిర్వహించారు. కొద్ది గంటల్లో ఓట్లను లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. ఈనెల 1న  పోలింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ మొత్తం ఎంత ఓటింగ్ పర్సంటేజ్ తేల్చేందుకు చాలా సమయం పట్టింది. డివిజన్ల వారిగా పోలింగ్ పర్సంటేజ్ ఇలా ఉంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నిన్న ఉదయం పోలింగ్‌ స్లోగా సాగింది. మూడు గంటల తర్వాత ఒక్కసారిగా పోల్‌ మీటర్ పెరిగింది. అయితే హాఫ్ సెంచరీని మాత్రం టచ్ కాలేదు. మొత్తం పోలింగ్ శాతం చూస్తే 46.55 శాతం నమోదైంది. 74 లక్షల మంది ఓటర్లలో 34 లక్షల 50 వేల మంది ఓటేశారు. ఆర్సీపురం డివిజన్‌లో అత్యధికంగా 67.71 శాతం నమోదైతే…యూసుఫ్‌గూడలో 32.33 శాతం తక్కువ పోలింగ్‌ నమోదైంది.

2016 లో 45.29 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. గతం కంటే 1.31 శాతం అధికంగా నమోదైంది. 2009లో 42.95 శాతం, 2002లో 41.04 శాతమే పోలింగ్‌ నమోదైంది. ఈ లెక్కన చూస్తే.. గతం కంటే కాస్త మెరుగే కాదా అన్న విశ్లేషణలున్నాయి. సాధారణ ఎన్నికల్లో 60 నుంచి 70 శాతం వరకు ఓటింగ్‌ నమోదవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం 50 శాతానికి మించడం లేదు. అయితే గతం కంటే ఒక శాతం పోలింగ్‌ పెరిగిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో హైదరాబాద్‌ నుంచి 15 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లారన్న అంచనాలున్నాయి. ఇలా వెళ్లిన వారిలో సగం మంది తిరిగొచ్చినా.. మిగిలినవారు అక్కడే ఉండిపోయారు. ఇక్కడికొచ్చిన వారూ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. టెకీలు, ఉద్యోగులు, కార్మికులు అందరూ హైదరాబాద్‌లో ఉండి ఓట్లు వేస్తే మరింత పెరిగేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఓటర్ల జాబితాలో చేర్పులేగానీ తీసివేతలు ఉండటం లేదు. చాలా మంది అడ్రస్ చేంజ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నా.. కొత్త ప్రాంతంలో ఓటు కల్పిస్తున్నారు తప్ప.. పాత ప్రాంతంలో తీసివేయడం లేదు. దీంతో వాస్తవం కంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారూ వేలల్లో ఉన్నారు. రీడూప్లికేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి అలాంటివి తొలగిస్తే వాస్తవ ఓటర్లు ఎంత మందో తేలే చాన్స్ ఉంది. ఒకే ఫ్యామిలీలో ఓటర్లకు రెండు వేరు వేరు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో.. ఎటూ వెళ్లలేక అసలు ఓటు వేయకుండా ఉండిపోయారన్న అనాల్సిస్ ఉంది.

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో