Earthquake: ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు..

ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రంలోని..

Earthquake: ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 04, 2020 | 6:39 AM

Eearthquake: ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రంలోని మయూర్ భంజ్ పట్టణంలో ముందుగా భూమి కంపించింది. ఆ తరువాత గంట వ్యవధిలోనే అంటే ఉదయం 3.10 గంటలకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాఘడ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, మయూర్ భంజ్ పట్టణంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదవగా, పితోరాఘడ్‌లో 2.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలాజీ అధికారులు ప్రకటించారు.