దూసుకొస్తున్న బురేవి.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. మరికొన్ని గంటల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై ప్రభావం..
బురేవి తుఫాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారింది. ఇది దిశ మార్చుకుని తూత్తుకూడి వద్ద ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ నిర్ణయం తీసుకుంది...
బురేవి తుఫాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారింది. ఇది దిశ మార్చుకుని తూత్తుకూడి వద్ద ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ నిర్ణయం తీసుకుంది. తీరం దాటే సమయంలో సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. తమిళనాడు, ఆంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ముఖ్యంగా తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకూడి, తెన్ కాశి, విరుధనగర్ , రామనాధపురం జిల్లాలో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. తీవ్ర గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఈ ఆరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అయితే ఇప్పటికే తమిళనాడులో ఈ ప్రభావం కనిపిస్తోంది. తిరువళ్లూరు జిల్లాలో లారీతో పాటు ఐదుగురు వరదలో చిక్కుకుపోయారు. వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని అధికారులు రెస్క్యూ సిబ్బంది ప్రాణాల్ని పణంగా పెట్టి వారిని రక్షించారు. ఆ ఆరు జిల్లాల్లో ఎన్డీఆర్ఐ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
గుమ్మిడిపూండిలోని జీఎన్ కండ్రిగ దగ్గర ఉన్న వంతెన కూలిపోవడంతో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో సిప్కోట్‌కి చెందిన లారీ వరద నీటిలో చిక్కుకుంది. లారీలో ఉన్న ఐదుగుర్ని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రోప్‌లను నీళ్లలోకి వేసి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
అటు కేరళ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సముద్రంలోకి ఎవరి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.