కరోనా వేళ.. మహారాష్ట్రలో ఎన్నికలు.. ఈసీకి గవర్నర్ లేఖ..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. భారత లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కాగా.. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఖాళీ అయిన 9 సీట్లకు ఎన్నికలు

కరోనా వేళ.. మహారాష్ట్రలో ఎన్నికలు.. ఈసీకి గవర్నర్ లేఖ..
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2020 | 11:16 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. భారత లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కాగా.. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఖాళీ అయిన 9 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపారు. కేంద్రం లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న నేపథ్యంలో కొన్ని సడలింపులిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిందని, ఆ మార్గదర్శకాలకు లోబడి మహారాష్ట్రలో ఖాళీ అయిన లెజిస్లేటివ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ ఈసీని కోరారు.

కాగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శాసనసభలో సభ్యుడు కాదని.. మే 27, 2020 లోపు ఆయన కౌన్సిల్‌కు ఎన్నిక కావాల్సి ఉందని గవర్నర్ ఈసీకి గుర్తుచేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై మహారాష్ట్ర గవర్నర్‌తో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా సమావేశం కానున్నారు.

[svt-event date=”30/04/2020,10:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]