అరుణాచల్ ప్రదేశ్‌లో కరోనా ల్యాబ్..!
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు జీరో అవుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇక్కడ మాత్రం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ కట్టడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అంతేకాదు.. లాక్‌డౌన్ నిబంధనలను కూడా కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్రంలో కోవిడ్-19 […]

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు జీరో అవుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇక్కడ మాత్రం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ కట్టడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అంతేకాదు.. లాక్‌డౌన్ నిబంధనలను కూడా కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షలు చేసే ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో కోవిడ్-19 ల్యాబ్ ఇదే మొదటిది. ఈ ల్యాబ్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరాం తరువాత ఇటువంటి కోవిడ్-19 ల్యాబ్ సౌకర్యం ఉన్న మూడవ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది.