మోదీ స్వరాష్ట్రంలో పెరుగుతున్న కరోనా మరణాలు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ముప్పైవేలకు పైగా కేసులు నమోదు కాగా.. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఇక ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడికి గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు మాత్రం పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రానికి కొత్తగా మరో 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రిత్వ […]

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ముప్పైవేలకు పైగా కేసులు నమోదు కాగా.. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఇక ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడికి గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు మాత్రం పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రానికి కొత్తగా మరో 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4395 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కాగా.. గురువారం ఒక్కరోజే.. కరోనా బారినపడి 17 మంది చనిపోయారని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్‌తో 214 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా నుంచి కోలుకుని గురువారం 89 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి మొత్తం 613 మంది కోలుకున్నారని ప్రభుత్వం పేర్కొంది.