CoronaVirus: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒకే హాస్టల్​లో 39 మందికి విద్యార్థినులకు పాజిటివ్.. తస్మాత్ జాగ్రత్త

మహారాష్ట్రలోని లాతూర్ నగరం ఎమ్​ఐడీసీ ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో 39 మంది విద్యార్థినులకు, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు ఒక అధికారి తెలిపారు.

CoronaVirus:  మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒకే హాస్టల్​లో 39 మందికి విద్యార్థినులకు పాజిటివ్.. తస్మాత్ జాగ్రత్త
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 23, 2021 | 6:35 PM

CoronaVirus: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. మహారాష్ట్రలోని లాతూర్ నగరం ఎమ్​ఐడీసీ ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో 39 మంది విద్యార్థినులకు, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు ఒక అధికారి తెలిపారు. వ్యాధి నిర్ధారించబడిన విద్యార్థినులకు తొమ్మిది, 10వ తరగతులకు చెందినవారు.  హాస్టల్​లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా 360 మంది విద్యార్థులను పరీక్షలు చేయించారు హాస్టల్​ నిర్వాహకులు.  వారిలో 39 మందికి పాజిటివ్ అని తేలింది. 60 మంది బోెధన, బోధనేతర సిబ్బందిలో 30 మంది శాంపిల్స్ తీసుకున్నామని వారి రిపోర్ట్స్ సాయంకాలానికి వస్తాయని లాతూర్ మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి మహేష్ పాటిల్  తెలిపారు. వ్యాధి సోకిన విద్యార్థినులు, ఉద్యోగులు నగరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్‌లో క్వారంటైన్ చేశామని అధికారులు తెలిపారు.

 పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా, మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తిని అరికట్టడానికి అనేక జిల్లాల్లో లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలతో సహా రాష్ట్రంలో కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గత మూడు రోజుల నుంచి మహారాష్ట్రలో 6,000 పైగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 5,000 మాత్రమే నమోదవ్వడం ఊరటనిచ్చే విషయం. కాగా కరోనాను లైట్ తీసుకోవద్దని మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Also Read:

 అనంతపురం జిల్లాలో పెనువిషాదం.. బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం

‘టక్​ జగదీష్’ టీజర్​‌తో వచ్చాడు.. టాప్ లేపుతున్నాడు.. మీరు చూశారా..?