ఎన్నికల ముందు, కేరళలో లెఫ్ట్ పార్టీలకు షాక్ ! 98 మంది బీజేపీలో చేరిక, 7 న రాష్ట్రానికి అమిత్ షా

కేరళ అసెంబ్లీ ఎన్నికలు  మరికొద్ది నెలల్లో జరగాల్సి ఉండగా లెఫ్ట్ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. మంగళవారం 98 మందికి పైగా  కాషాయ..

  • Umakanth Rao
  • Publish Date - 6:32 pm, Tue, 23 February 21
ఎన్నికల ముందు, కేరళలో లెఫ్ట్ పార్టీలకు షాక్ ! 98 మంది బీజేపీలో చేరిక, 7 న రాష్ట్రానికి అమిత్ షా

కేరళ అసెంబ్లీ ఎన్నికలు  మరికొద్ది నెలల్లో జరగాల్సి ఉండగా లెఫ్ట్ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. మంగళవారం 98 మందికి పైగా  కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ కు చెందినవారున్నారు. కేంద్ర మంత్రులు వి. మురళీధరన్, ప్రహ్లాద్ జోషీల సమక్షంలో వీరు బీజేపీలో చేరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21 న బీజేపీ నేత, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రాష్ట్రాన్ని సందర్శించి విజయ యాత్ర చేపట్టినప్పటి నుంచి క్రమంగా  బీజేపీకి  ఆదరణ పెరుగుతూ వచ్చింది. పైగా మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ సైతం ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అటు మార్చ్ 7 న హోమ్ మంత్రి అమిత్ షా కేరళను సందర్శించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ సందర్భంగా ఇంకా కొంతమంది కమలం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రానున్న ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలతో బాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంపై కూడా బీజేపీ కన్ను వేసింది. తను త్వరలో కేరళను విజిట్ చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కేరళపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ తరచూ ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. సోమవారం ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు.

Also Read:

సచివాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రులు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పరస్పరం అభినందనలు

ఐసిస్ టెర్రరిస్టుకు బెయిల్ మంజూరు సబబే, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఎన్ఐ కోర్టు అప్పీలుకు తిరస్కృతి