Egg Benefits of Hair: గుడ్డు మంచి పోషకారమే కాదు .. జుట్టుకు అందాన్ని, పోషకాన్ని ఇచ్చే సౌందర్యం సాధనం..
Egg Benefits of Hair: గుడ్డును సంపూర్ణ ఆహారం. అందుల్లనే ఈ గుడ్డును రోజూ తినే ఆహారంలో చేర్చుకోవమని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుడ్డు ఆహారంగా తినడానికే కాదు..
Egg Benefits of Hair: గుడ్డును సంపూర్ణ ఆహారం. అందుల్లనే ఈ గుడ్డును రోజూ తినే ఆహారంలో చేర్చుకోవమని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుడ్డు ఆహారంగా తినడానికే కాదు.. మంచి అందాన్ని ఆరోగ్యకరమైన జుట్టుని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. గుడ్డులో ప్రోటీన్లు, ఎ, కె, బి, డి, ఇ వంటి విటమిన్లు ఉంటాయి.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం గుడ్లు ఎందుకు ఉపయోగించాలి?
• విటమిన్ ఎ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. • విటమిన్ కె జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు రంగు మారకుండా సహాయపడుతుంది. • విటమిన్ బి కాంప్లెక్స్‌లో బి 6, బి 7, బి 12, బి 3 వంటి విటమిన్లు ఉన్నాయి, ఇవి జుట్టు రాలడం, జుట్టు పొడిగా మారడాన్ని నివారిస్థాయి. • గుడ్లలోని విటమిన్ ఇ జుట్టును స్మూత్ చేయడంతో పాటు షైనింగ్ కూడా ఇస్తుంది. • గుడ్డులో సెలీనియం, సల్ఫర్, జింక్, రాగి, ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి జుట్టు రాలకుండా ఉండటానికి సహాయపడతాయి.
గుడ్డుని జుట్టుకు ఎలా ఉపయోగించాలంటే..
కావలిసిన పదార్ధాలు గుడ్డు ఒకటి అరటి పండు ఒకటి (మెత్తని) తేనె 3 టేబుల్ స్పూన్లు పాలు 3 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్పా 5 టేబుల్ స్పూన్లు బౌల్ హెయిర్ బ్రష్ అప్లికేషన్ కోసం
ముందుగా ఒక గిన్నె తీసుకుని.. అందులో గుడ్డుని వేసి.. దానిని ఒక ఫోర్క్ తో బాగా గిలకొట్టండి.. తర్వాత మిగిలిన అన్ని పదార్ధాలను వేసి మళ్ళీ ఫోర్క్ తో మృదువైన పేస్ట్ తయారు అయ్యేవరకూ కొట్టండి.. తర్వాత ఆ పేస్ట్‌ను జుట్టుకు.. నెట్టికి అంటే విధంగా అప్లై చేసుకోండి. అనంతరం షవర్ క్యాప్ తో కవర్ చేసుకుని.. అలా ఒక గంట పాటు ఉండండి.. అనంతరం తేలికపాటి షాంపూ తో తలకు స్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేసే మంచి స్కిల్కీ జుట్టు మీ సొంతం
జుట్టుకు కండిషనర్ బదులు గుడ్డు తో ..
గుడ్డు ఒకటి తేనె రెండు స్పూన్లు పెరుగు రెండు స్పూన్లు ఒక గిన్నె
తయారీ విధానం: అన్ని పదార్ధాలను ఒక చిన్న గిన్నె వేసి.. బాగా మిక్స్ చేయండి.. తర్వాత ఆ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి.. సుమారు ఒక గంట అలా ఉంచి.. తరువాత చల్లటి నీటి తో జుట్టుని కడిగి.. అనంతరం షాంపూ తో తల స్నానం చేయండి.
జట్టులోని జిడ్డుని తొలగించుకోవడానికి
గుడ్డులోని తెల్లసొన ఆలివ్ ఆయిల్ -ఒక టీస్పూన్
గుడ్డులోని తెల్లసొనను ఆలివ్ నూనెను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఒక పేస్ట్ తయారవుతుంది. దీనిని జుట్టుకు అప్లై చేసి.. ఒక 20 నిముషాలు ఆరనివ్వండి. అనంతరం తలస్నానం చేయండి.
Also Read: పూణేలో పోలీసు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చే మొదటి మహిళ దీప్తి.. మరింత మంది మహిళలు రావాలంటూ..