లోక్ సభ అజెండా లిస్ట్ లోనే ఐటమ్ పదం ఉంది, కమల్ నాథ్

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి తాను  ‘ఐటెమ్’ అని వ్యాఖ్యానించడం, దానిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మళ్ళీ కాస్త ఆగ్రహంగా స్పందించారు. తను తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యానని, ఎన్నో ఏళ్లు ఎంపీగా ఉన్నానని, లోక్ సభ అజెండా షీట్ లోనే నెం.1, నెం.2 ఐటమ్స్ అని ఉందని చెప్పారు. ‘అదే నా మైండ్ లో ఉంది..అంతే […]

  • Umakanth Rao
  • Publish Date - 4:27 pm, Sat, 31 October 20
లోక్ సభ అజెండా లిస్ట్ లోనే ఐటమ్ పదం ఉంది, కమల్ నాథ్

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి తాను  ‘ఐటెమ్’ అని వ్యాఖ్యానించడం, దానిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మళ్ళీ కాస్త ఆగ్రహంగా స్పందించారు. తను తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యానని, ఎన్నో ఏళ్లు ఎంపీగా ఉన్నానని, లోక్ సభ అజెండా షీట్ లోనే నెం.1, నెం.2 ఐటమ్స్ అని ఉందని చెప్పారు. ‘అదే నా మైండ్ లో ఉంది..అంతే తప్ప ఎవరినీ అవమానపరచాలన్నది  నా ఉద్దేశం కాదు.. ఎవరైనా తమకు అవమానం జరిగినట్టు ఫీలైతే అందుకు చింతిస్తున్నానని ఇదివరకే చెప్పాను’ అని కమల్ నాథ్ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ స్టార్ క్యాంపెయినర్ గా తనను తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సవాలు చేశారు. తనకు ఆ సంస్థ ఎలాంటి నోటీసునూ పంపలేదని, ఆ పదంఫై వివరణ ఇవ్వాలని కోరలేదని కమల్ నాథ్ తెలిపారు. ఇలా ఉండగా… ఈసీ నిర్ణయంపై  తాము కోర్టుకెక్కుతామని  మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ప్రకటించింది. మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 3 న ఉపఎన్నికలు జరగనున్నాయి.