అమ్మవారి పాదాల చెంత రక్తమోడుతున్న జిన్‌పింగ్‌ తల

గత కొంతకాలంగా చైనావాడు కుతంత్రాలు పన్నుతున్నాడు.. మన భూభాగం మీదకు జొరపడే ప్రయత్నం చేస్తున్నాడు.. చైనా పన్నాగాలను మనం తిప్పికొడుతున్నామనుకోండి.. అయినా చైనా అంటే మనకు పీకల్దాక కోపం వుంది.

  • Publish Date - 6:07 pm, Fri, 23 October 20
అమ్మవారి పాదాల చెంత రక్తమోడుతున్న  జిన్‌పింగ్‌ తల

గత కొంతకాలంగా చైనావాడు కుతంత్రాలు పన్నుతున్నాడు.. మన భూభాగం మీదకు జొరపడే ప్రయత్నం చేస్తున్నాడు.. చైనా పన్నాగాలను మనం తిప్పికొడుతున్నామనుకోండి.. అయినా చైనా అంటే మనకు పీకల్దాక కోపం వుంది. మనకు కాదు అగ్రదేశం అమెరికాకు కూడా చైనా మీద కొండంత ఆగ్రహం ఉంది. కారణం కరోనా వైరస్‌ సృష్టికర్త చైనానేనని బలమైన నమ్మకం.. కొందరు సైంటిస్టులు కూడా ఇదే మాటన్నారు.. ఆ వైరస్‌ చైనా ల్యాబ్‌లో తయారయ్యిందేనని గట్టిగా చెబుతున్నారు.. అలాంటి చైనాపై ఉన్న కోపాన్ని దసరా నవరాత్రులలో కాసింత సృజనాత్మకంగా చూపించారు కోల్‌కతావాసులు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ విగ్రహం తల నరికివేసి దుర్గామాత కాళ్ల కింద పడేశారు.. పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారి చేతిలో హతమైన మహిషాసురుడి స్థానంలో రక్తం కక్కుతున్న జిన్‌పింగ్‌ బొమ్మను పెట్టారు.. దీన్ని కాళిమాత కాళ్ల కింద ఉంచారు. కాళికాదేవి వాహనమైన సింహం మొండాన్ని తింటున్నట్టుగా విగ్రహం ఉంది.. దీని రూపకర్త ఆర్టిస్ట్‌ అషిమ్‌పాల్‌… ఇప్పుడు ఈ విగ్రహం ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. శభాష్‌ అషిమ్‌పాల్‌ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు..