లవర్స్…బి కేర్ ఫుల్

హైదరాబాద్‌: లవర్స్ డే సందర్భంగా షీ టీమ్స్ యాక్టీవ్ అయ్యాయి. ఓవైపు యువతీ యువకులు కలిసి తిరిగే అవకాశం ఉండటం.. మరోవైపు బజరంగ్ దళ్, స్వయం సేవక్ సంఘ్ లాంటి కార్యకర్తలు మోహరించనున్న నేపథ్యంలో నిఘా ఉంచాలని నిర్ణయించారు. యువత ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో షీటీమ్స్ ఈ రోజంగా గస్తీ తిరగనున్నాయి. గతంలో ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కొన్ని పార్కుల్ని సంఘాలు మూసేశాయి. ఆరోజుల్లో కలిసి తిరిగిన జంటలకు పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నించడం చాలాసార్లు వివాదాలకు తావిచ్చాయి. […]

లవర్స్...బి కేర్ ఫుల్

హైదరాబాద్‌: లవర్స్ డే సందర్భంగా షీ టీమ్స్ యాక్టీవ్ అయ్యాయి. ఓవైపు యువతీ యువకులు కలిసి తిరిగే అవకాశం ఉండటం.. మరోవైపు బజరంగ్ దళ్, స్వయం సేవక్ సంఘ్ లాంటి కార్యకర్తలు మోహరించనున్న నేపథ్యంలో నిఘా ఉంచాలని నిర్ణయించారు. యువత ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో షీటీమ్స్ ఈ రోజంగా గస్తీ తిరగనున్నాయి.

గతంలో ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కొన్ని పార్కుల్ని సంఘాలు మూసేశాయి. ఆరోజుల్లో కలిసి తిరిగిన జంటలకు పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నించడం చాలాసార్లు వివాదాలకు తావిచ్చాయి. ఇలాంటి ఘటనల దృష్ట్యా గురువారం పటిష్ఠ పర్యవేక్షణ చేపట్టాలని షీ బృందాలు నిర్ణయించాయి. అన్ని పార్కులతో పాటు, నక్లెస్ రోడ్, పీపుల్స్‌ ప్లాజా, పబ్లిక్‌ గార్డెన్‌, బిర్లా టెంపుల్‌, గొల్కొండ, మల్టీప్లెక్స్‌లు.. లాంటి ప్రాంతాల్లో నిఘా ఉంచేందుకు సిద్ధమయ్యారు.

ఒకవేళ జంటల్ని ఎవరైనా బెదిరించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హైదరాబాద్‌ షీ బృందం బాధ్యురాలు సి.నర్మద వెల్లడించారు. బుధ, గురువారాల్లో రాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాలతో పాటు ఐస్‌క్రీమ్‌ పార్లర్లు, పబ్‌లు, రెస్టారెంట్ల వద్ద నిఘా ఉంచనున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉండటంతో ఆయా చోట్ల గస్తీ పెంచామని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో యువతీ యువకుల కదలికలపై పేరెంట్స్ కూడా జాగ్రత్త వహించాలని పోలీసులు చెబుతున్నారు.

Published On - 10:43 am, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu