ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:38 PM

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పశ్చిమ ఢిల్లీలోని నరైనా ప్రాంతంలో ఓ పేపర్‌ ఇండస్ట్రీలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 23 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మూడు రోజుల్లో ఢిల్లీలో ఇది మూడో అగ్నిప్రమాదం. రెండు రోజుల క్రితం కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో […]

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పశ్చిమ ఢిల్లీలోని నరైనా ప్రాంతంలో ఓ పేపర్‌ ఇండస్ట్రీలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 23 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

అయితే మూడు రోజుల్లో ఢిల్లీలో ఇది మూడో అగ్నిప్రమాదం. రెండు రోజుల క్రితం కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందగా.. బుధవారం ఓ మురికివాడలో చెలరేగిన మంటల్లో 250 గుడిసెలు దగ్ధమయ్యాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu