లాక్ డౌన్ పాలసీ రేపే… కేంద్రం మినహాయింపులు ఇవే

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పటికీ కొన్ని మినహాయింపులు ఇచ్చే విషయంలో సీరియస్ గా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఎగ్జిట్‌ స్ట్రాటజీని మంగళవారం పరోక్షంగా వెల్లడించినట్టు పలువురు భావిస్తున్నారు.

Follow us

|

Updated on: Apr 14, 2020 | 5:02 PM

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పటికీ కొన్ని మినహాయింపులు ఇచ్చే విషయంలో సీరియస్ గా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఎగ్జిట్‌ స్ట్రాటజీని మంగళవారం పరోక్షంగా వెల్లడించినట్టు పలువురు భావిస్తున్నారు. తద్వారా దేశ ప్రజలకు గొప్ప రిలీఫ్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు.

ఈనెల 20వ వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి, వైరస్‌ను నియంత్రిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. అదేసమయంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే వ్యూహం లేదా ఆంక్షలతో కూడిన సడలింపులను ప్రకటించడానికి సంబంధించి బుధవారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసే అవకాశం ఉంది.

అయితే, ఈ మార్గదర్శకాలకు ఏయే అంశాలు ప్రామాణికంగా నిలుస్తాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా వైరస్‌ ప్రభావం లేని చోట ఆంక్షలను సడలించాలని ఏపీ సీఎం జగన్‌ ఇప్పటికే ప్రధాని మోదీకి విన్నవించారు. ఇప్పుడు మోదీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, ఎగ్జిట్‌ స్ట్రాటజీకి రూపకల్పన చేసే పనిలో ఉన్నారు.

ఇక తెలంగాణలో వ్యవసాయరంగానికి, ఫుడ్‌ ప్రాసిసెంగ్‌ రంగానికి లాక్‌డౌన్‌ లేదు. అంటే ఈ రంగాలు యధావిధిగా పనిచేస్తాయి. తెలంగాణ ఆలోచనను కూడా మోదీ పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన మాటల ద్వారా అర్థం అవుతోంది. లాక్‌డౌన్‌ను సడలించడానికి రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌ వంటి ప్రామాణికాలను ప్రధాని మోదీ చెబుతారని భావించారు. కానీ ఇవన్నీ రేపు విడుదల కాబోయే మార్గదర్శకాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, హౌసింగ్‌తోపాటు నిర్మాణ రంగాలకు అనుమతి ఇవ్వాలని- పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం- కేంద్ర హోంశాఖను కోరింది. ఇప్పటికే రవాణారంగం దెబ్బతిన్నది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల ట్రక్కులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వీటిలో 35వేల కోట్ల రూపాయల సరుకు రోడ్లమీద నిలిచిపోయింది. అందుకే అంతర్రాష్ట్ర రవాణాతోపాటు, రాష్ట్రాల్లో అంతర్గతంగా రవాణాను, నగరాల మధ్య రవాణాకు అనుమతులు ఇవ్వాలని ఈ విభాగం కేంద్రాన్ని కోరింది.

అలాగే, మొబైల్‌, ఫ్రిజ్‌లు, ఏసీలు, టీవీలు, ప్లంబింగ్‌, ఎలక్ట్రీషియన్‌, వాహన మెకానిక్స్‌కు అనుమతి ఇవ్వాలని కూడా కేంద్రానికి విన్నపాలు అందాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, తక్కువ తీవ్రత ఉన్న ప్రాంతాలు, కరోనా వ్యాప్తి చెందని ప్రాంతాలను విడదీసి, ఈనెల 20 తర్వాత ఆంక్షలతో కూడిన సడలింపులు కేంద్రప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది.