మెరుపు.. ఆకాశం నుంచి ఇలా ఉంటుంది..

ఆకాశంలో మెరుపులు ఎలా కనిపిస్తాయో చూపించే ఓ వీడియోను తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో షేర్ చేశారు. ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసిన బాబ్....

మెరుపు.. ఆకాశం నుంచి ఇలా ఉంటుంది..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 22, 2020 | 11:03 PM

మెరుపు.. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ఆకాశంలో కనిపించే ఓ విద్యుత్తు తరంగం. మనల్ని ఉలిక్కిపడేలా చేసే మెరుపు.. ఎలా వస్తుంది.. ఎక్కడ నుంచి వస్తుంది.. అని మనకు చిన్నప్పటి నుంచి అర్థం కాని మెపుపులాంటి ప్రశ్న… ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టాడు  నాసాకు చెందిన ఆస్ట్రోనాట్‌.

బాబ్ బెన్‌కెన్ అనే ఆస్ట్రోనాట్‌.. ఆకాశంలో మెరుపు ఎలా వస్తుందో వివరించారు. అంతరిక్షం నుంచి ఆకాశంలో మెరుపులు ఎలా కనిపిస్తాయో చూపించే ఓ వీడియోను తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో షేర్ చేశారు. ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసిన బాబ్.. ‘ఆకాశంలో మెరుపులు అంతరిక్షంలో ఇలా కనిపిస్తున్నాయి. ఆ మెరుపుల వయలెట్ రంగు అంచులు చూపు తిప్పుకోనివ్వడం లేదు కదా’ అని రాసుకొచ్చారు. ఆ మెరుపు వీడియోను మీరు చూడండి…

బాబ్ గతంలో కూడా అంతరిక్షంలో కొత్తగా కనుగొన్న నియోవైజ్ అనే తోకచుక్క ఫొటోలు కూడా షేర్ చేశారు.