అంగారకుడిపై కీటకాలు..రోవ‌ర్స్ తీసిన ఫోటోలు..

అంగారక గ్రహం జీవించడానికి యోగ్యమైన ప్రదేశమేనా..? అసలు అక్కడ  జీవం ఉందా లేదా అన్నది తెలుసుకోడానికి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తల మధ్యే భిన్నమైన వాదనలు ఉన్నాయి. తాజాగా  అరుణ గ్ర‌హంపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికాలోని ఓహియో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంగారకుడిపై కీట‌కాల లాంటి ప్రాణులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మార్స్ రోవర్స్ పంపించిన చిత్రాలను జాగ్రత్తగా పరిశీలించగా.. అక్కడ కొన్ని పురుగులు లాంటి కీటకాలు ఉన్నట్లు తాము కనుగొన్నామని ప్రొఫెసర్ ఎమిరిటస్ […]

అంగారకుడిపై కీటకాలు..రోవ‌ర్స్ తీసిన ఫోటోలు..
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 3:22 PM

అంగారక గ్రహం జీవించడానికి యోగ్యమైన ప్రదేశమేనా..? అసలు అక్కడ  జీవం ఉందా లేదా అన్నది తెలుసుకోడానికి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తల మధ్యే భిన్నమైన వాదనలు ఉన్నాయి. తాజాగా  అరుణ గ్ర‌హంపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికాలోని ఓహియో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంగారకుడిపై కీట‌కాల లాంటి ప్రాణులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మార్స్ రోవర్స్ పంపించిన చిత్రాలను జాగ్రత్తగా పరిశీలించగా.. అక్కడ కొన్ని పురుగులు లాంటి కీటకాలు ఉన్నట్లు తాము కనుగొన్నామని ప్రొఫెసర్ ఎమిరిటస్ విలియం రోమోసర్ తెలిపారు. అవి ఈగలు మరియు తేనెటీగల రూపంలో ఉన్నట్లు ప్రొఫెసర్ వెల్లడించారు. భూమిపై జీవించే చాలా కీటకాలకు పోలికలతోనే అవి కూడా ఉన్నట్టు ఆయన ఆధారాలను చూపిస్తున్నారు.

చాలా ఫోటోల్లో రెక్కలు, కాళ్లు, కొమ్ములు వంటి ఆధారాలు లభించాయని, ఓ కీటకం ఎగిరినప్పుడు తీసిన ఫోటో అరుణ గ్ర‌హంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన ఆధారంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. పామును పోలి ఉండే ఓ శిలాజ జీవి తాలుకా ఆనవాళ్లు కూడా లభ్యమైనట్టు వివరించారు. 45 సంవత్సరాలు ఒహియో విశ్వవిద్యాలయంలో కీటక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసిన రోమోసర్ వాదనలతో.. అంగారక గ్రహంపై..జీవం ఉందనే చర్చ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.