ఆ హోటల్‌లో గది అద్దె రూ. 66 మాత్రమే…!

ఒక పదిశాతం ధనవంతుల సంగతి పక్కనపెడితే..మిగతా తొంభై శాతం మంది బడ్జెట్ పద్మనాభాలే. అంటే చేసే ప్రతిపనిలో, కొనే ప్రతి వస్తువు విషయంలో డబ్బుల గురించి అంచనా వేసుకునేవారే అనమాట. ఇక ఏదైనా ట్రిప్స్‌కి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ బడ్జెట్ లెక్కలు వేరే రేంజ్‌లో ఉంటాయి. ముఖ్యంగా హోటల్స్ విషయంలో అయితే తక్కువ అద్దెలో ఎక్కువ సౌకర్యాలు కోరుకుంటారు చాలామంది. ఎన్ని ఆఫర్స్ ఉన్నా, ఎన్ని ప్రోమో కోడ్స్ అప్లై చేసినా..మనం చేసే పేమెంట్‌ని బట్టే […]

ఆ హోటల్‌లో గది అద్దె రూ. 66 మాత్రమే...!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 4:16 PM

ఒక పదిశాతం ధనవంతుల సంగతి పక్కనపెడితే..మిగతా తొంభై శాతం మంది బడ్జెట్ పద్మనాభాలే. అంటే చేసే ప్రతిపనిలో, కొనే ప్రతి వస్తువు విషయంలో డబ్బుల గురించి అంచనా వేసుకునేవారే అనమాట. ఇక ఏదైనా ట్రిప్స్‌కి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ బడ్జెట్ లెక్కలు వేరే రేంజ్‌లో ఉంటాయి. ముఖ్యంగా హోటల్స్ విషయంలో అయితే తక్కువ అద్దెలో ఎక్కువ సౌకర్యాలు కోరుకుంటారు చాలామంది. ఎన్ని ఆఫర్స్ ఉన్నా, ఎన్ని ప్రోమో కోడ్స్ అప్లై చేసినా..మనం చేసే పేమెంట్‌ని బట్టే హోటల్లో సౌకర్యాలు ఉంటాయి. అయితే జపాన్‌లోని ఓ హోటల్‌ మాత్రం ఇందుకు పూర్తి విరుద్దం. ఆ దేశంలోని అసాహి ర్యోకన్‌ అనే హోటల్ యాజమాన్యం కేవలం 100యెన్‌లు…అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.66 చెల్లిస్తే ఒక రాత్రికి గదిని అద్దెకు ఇచ్చేస్తుంది. అలాగని సౌకర్యాలకు కూడా కొదవ ఉండదు. నేలపై బెడ్డు, టీవీ, టేబుల్, టీపాయ్, ఫ్యాన్, శుభ్రంగా ఉండే బాత్రూం అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ రూమ్స్ ఇవ్వాలంటే మాత్రం నిర్వాహకులు పెట్టే  ఒక కండీషన్‌‌కి అంగీకారం తెలపాలి.

అది ఏంటంటే..రాత్రి మొత్తం మీ బసని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలి. కొన్ని ప్రైవసీ సందర్భాల్లో మాత్రం అందుకు మినహాయింపు ఉంటుంది. గతంలో ఆ హోటల్‌‌లో బస చేసిన ఓ బ్రిటిష్ యూట్యూబర్‌ ఇలాగే తన గడిపిన సమయం మొత్తాన్ని లైవ్‌స్ట్రీమ్‌ చేశాడు. ఐడియా నచ్చిన హోటల్ యాజమాన్యం అదే థీమ్‌ను ఫాలో అయిపోతుంది. ఈ వెరైటీ అనుభూతిని ఆస్వాదించాలని చాలామంది టూరిస్టులు సదరు హోటల్‌కు క్యూ కడుతున్నారట. ఐడియా అదుర్స్ కదా..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు