దళితుడిని ప్రేమించినందుకు..కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి
ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. రోజూ ఏదో ఒక మూలన ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా చేస్తోన్నా మనుషుల ఆలోచనా ధోరణి మాత్రం మారడం లేదు. తాజాగా తమిళనాడులో పరువు హత్య కలకలం సృష్టించింది. దళితుడిని ప్రేమించినందుకు కన్న కూతురిపైనే కిరోసిన్ పోసి తగులబెట్టింది ఓ తల్లి. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. నాగపట్టణం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. […]
ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. రోజూ ఏదో ఒక మూలన ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా చేస్తోన్నా మనుషుల ఆలోచనా ధోరణి మాత్రం మారడం లేదు. తాజాగా తమిళనాడులో పరువు హత్య కలకలం సృష్టించింది. దళితుడిని ప్రేమించినందుకు కన్న కూతురిపైనే కిరోసిన్ పోసి తగులబెట్టింది ఓ తల్లి. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. నాగపట్టణం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..నాగపట్టణానికి దగ్గర్లోని గ్రామంలో 18 ఏళ్ల జనని అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివశిస్తుంది. యువతి తల్లి ఉమా మహేశ్వర్ రోజువారీ కూలీ కార్మికురాలు కాగా, ఆమె తండ్రి కన్నన్ వడ్రంగి. కాగా జనని గత కొంతకాలంగా దళిత వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. పెళ్లికి వారు నిరాకరించారు. దీంతో ఏడాది క్రితం జనని, ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ తల్లిదండ్రులు తిరిగి తీసుకువచ్చారు. అప్పట్నుంచి కాలేజ్ కూడా మాన్పించారు. తాజాగా జననికి 18 ఏళ్లు నిండటంతో పెళ్లి చెయ్యాలని భావించారు తల్లిదండ్రులు. అయితే అందుకు జనని ఒప్పుకోకపోగా, ప్రియుడ్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఇదే విషయంలో జనని, ఆమె తల్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కూతురి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి.. కోపంలో కిరోసిన్ పోసి నిప్పటించింది. అనంతరం తానూ కాల్చుకుంది. తీవ్రగాయాలైన జనని చనిపోగా, ప్రస్తుతం ఆమె తల్లి చావుతో పోరాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.