AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌ఐసీ పాలసీదారులకు షాక్.. నవంబర్ 30 నుంచి కొన్ని పాలసీలు బంద్!

మీకు ఎల్‌ఐసీ బీమా ఉందా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా(ఎల్ఐసీ) తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి కొన్ని బీమా పాలసీలు నిలిపేసేందుకు నిర్ణయం తీసుకుంది. జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్యతోపాటు జీవన్ లాభ్ లాంటి సుమారు 12 రకాల బీమా పథకాలను, పలు రకాల గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలను, ఇతర రైడర్లు నవంబర్ 30 తర్వాత నుంచి కనుమరుగు కానున్నాయి. ఇన్సూరెన్స్ బీమా […]

ఎల్‌ఐసీ పాలసీదారులకు షాక్.. నవంబర్ 30 నుంచి కొన్ని పాలసీలు బంద్!
Ravi Kiran
|

Updated on: Nov 07, 2019 | 8:52 PM

Share

మీకు ఎల్‌ఐసీ బీమా ఉందా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా(ఎల్ఐసీ) తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి కొన్ని బీమా పాలసీలు నిలిపేసేందుకు నిర్ణయం తీసుకుంది. జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్యతోపాటు జీవన్ లాభ్ లాంటి సుమారు 12 రకాల బీమా పథకాలను, పలు రకాల గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలను, ఇతర రైడర్లు నవంబర్ 30 తర్వాత నుంచి కనుమరుగు కానున్నాయి.

ఇన్సూరెన్స్ బీమా రెగ్యులేటర్ సవరించిన కస్టమర్- సెంట్రిక్ పాలసీ రూల్స్ ప్రకారం ఎల్ఐసీ ఈ మేరకు సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొత్త పాలసీలకు మాత్రం బోనస్ రేట్లు తక్కువగా.. ప్రీమియమ్ రేట్లు అధికంగా ఉంటాయని సంస్థ తెలిపింది.

మరోవైపు ఎల్ఐసీ.. జూలై 8, 2019న జారీ చేయబడిన కొత్త నాన్- లింక్డ్, లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ రెగ్యులేషన్స్‌కు కట్టుబడకపోవడంతోనే దాదాపు 75-80 శాతం జీవిత బీమా పాలసీలు నవంబర్ 30న మూసివేయనున్నారని సమాచారం. దీంతో సదురు పాలసీలను నవంబర్ 30 కంటే ముందే తీసుకోవాలని వినియోగదారులను ఎల్ఐసీ ఏజంట్లు కోరుతున్నారు.

మరోవైపు ఎల్ఐసీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘కొన్ని బీమా పాలసీలను నవంబర్ 30కి మూసివేస్తున్నామని.. ఆ తర్వాత వాటిని కాస్త సవరించి కొత్త పేర్లతో మళ్ళీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని’ తెలిపారు.  దీని బట్టి చూస్తే కొత్త పాలసీ తీసుకోవాలనుకునే వారు ఈ నెల ఆగడం ఉత్తమమే అని చెప్పాలి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..