బ్రేకింగ్: ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం!

ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు. పేద విద్యార్థుల బ్రతుకులు బాగుపడడానికే సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు . పేదవారికి రైట్ టు ఎడ్యుకేషన్ కాదని.. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ను తీసుకురావడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. అయితే వారి న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంతో విద్యార్థుల భవిష్యత్‌కు పునాది పడుతుందన్నారు. మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లిష్ […]

బ్రేకింగ్: ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం!
Follow us

|

Updated on: Jan 23, 2020 | 2:15 PM

ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు. పేద విద్యార్థుల బ్రతుకులు బాగుపడడానికే సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు . పేదవారికి రైట్ టు ఎడ్యుకేషన్ కాదని.. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ను తీసుకురావడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. అయితే వారి న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంతో విద్యార్థుల భవిష్యత్‌కు పునాది పడుతుందన్నారు. మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లిష్ మీడియం చదువు చాలా అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. మండలి తిరస్కరిస్తూ పలు సవరణలను సూచించిన సంగతి తెలిసిందే. అయితే మండలి చేసిన సవరణలను తిరస్కరిస్తూ ఈ బిల్లును మరోసారి అసెంబ్లీ ఆమోదించింది.

ఇంగ్లీష్ మీడియం బిల్లుపై సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే…

  • పేదవారికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ ఇవ్వడమే లక్ష్యం’
  • ఇంగ్లీష్ మీడియంతో పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది
  • రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి
  • ప్రైమరీ స్కూల్స్ నుంచే పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాలని లక్ష్యం
  • ప్రభుత్వ స్కూల్స్‌లో 30 శాతం కూడా ఇంగ్లీష్ మీడియం లేదు
  • కానీ ప్రైవేట్ స్కూళ్లలో 98% ఇంగ్లీష్ మీడియం ఉంది
  • పేద విద్యార్థులకు ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలకు పోటీ పడతారు
  • ఇంగ్లీష్ ఉంటేనే కార్పొరేట్ ఉద్యోగాలు వస్తాయి
  • గత అసెంబ్లీలో ఇదే బిల్లును మండలిలో అడ్డుకున్నారు
  • పేదవాడికి న్యాయం చేస్తుంటే అడ్డుకుంటున్నారు
  • విద్యా చట్టం సవరణ బిల్లుకు మరోసారి అసెంబ్లీ ఆమోదముద్ర

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..