ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రాత్రి కాదు మధ్యాహ్నం.. అవును నిజం.. ! ఎప్పుడో తెలుసా..?
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఈ నెల 30న అంటే కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అని నిపుణులు అంటున్నారు. ఈ చంద్ర గ్రహణం కంటికి కనిపించదని...

Last Lunar Eclipse : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఈ నెల 30న అంటే కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అని నిపుణులు అంటున్నారు. ఈ చంద్ర గ్రహణం కంటికి కనిపించదని… అందుకే దీనిని ఉపఛాయ చంద్రగ్రహణం అని పిలుస్తున్నారని వారు స్పష్టం చేశారు.
ఈ ఉపఛాయ చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో ఏర్పడనుందని వెల్లడించారు. నవంబర్ 30న మధ్యాహ్నం సమయంలో ప్రారంభమై సాయంత్రం 5.22 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ఉపఛాయ చంద్రగ్రహణం మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:22 గంటలకు గ్రహణం ముగింపు దశ అని అన్నారు.