భూముల రీసర్వే కార్యక్రమానికి పేరు మార్చిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టనున్న భూముల రీసర్వే కార్యక్రమానికి.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంగా పేరు మారుస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టనున్న భూముల రీసర్వే కార్యక్రమానికి.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంగా పేరు మారుస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్లు, కార్స్ టెక్నాలజీని రీసర్వే కోసం వినియోగించాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాగా భూముల రీసర్వే ప్రాజెక్టు కోసం 987.46 కోట్ల రూపాయల మేర పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాథమికంగా రెండు వందల కోట్లు వ్యయం అవుతుందని సర్కార్ అంచనా వేసింది. రీసర్వే కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టేందుకు ప్రస్తుతం 987.46 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. భూముల రీసర్వే గురించి డ్రోన్ల కోసం రూ.81 కోట్లు, కార్స్ నెట్ వర్క్ జిఎన్ఎస్ రోవర్లకు రూ.100 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బార్డర్ రాళ్ల కోసమే రూ.600.62 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వ్యవసాయ భూములు, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల్లోనూ రీసర్వే కార్యక్రమం చేపట్టనున్నారు.
Also Read :
పాపం.. టపాసు పేలి..అతడి కొత్త కారు పూర్తిగా దగ్ధమైంది