బెంగళూరు హింస కేసులో మాజీ మేయర్ సంపత్ రాజ్ అరెస్ట్..

నలుగురు వ్యక్తుల చావుకు కారణమంటూ ఆరోపణలు రావడంతో బెంగళూరు మాజీ మేయర్ తోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు హింస కేసులో మాజీ మేయర్ సంపత్ రాజ్ అరెస్ట్..
Follow us

|

Updated on: Nov 17, 2020 | 3:41 PM

ప్రజా రక్షకుడిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే నేరస్థులుగా మారుతున్నారు. నలుగురు వ్యక్తుల చావుకు కారణమంటూ ఆరోపణలు రావడంతో బెంగళూరు మాజీ మేయర్ తోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో నలుగురి మృతికి కారణమైన హింస కేసులో మాజీ మేయర్‌ ఆర్‌ సంపత్‌ రాజ్ అరెస్ట‌య్యాడు. ప‌రారీలో ఉన్న‌ సంప‌త్‌రాజ్‌తోపాటు అతని సహచరుల‌ను కూడా అదుపులోకి తీసుకున్న‌ట్లు బెంగ‌ళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. సంపత్‌రాజ్‌ మేనల్లుడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక వార్తతో బెంగళూరులోని జీవనహళ్లి ప్రాంతంలో పెద్ద ఏత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ సందర్బంగా నిరసనకారులు హింస‌కు పాల్ప‌డ్డారు.

ఈ సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్‌ అఖండ శ్రీనివాసమూర్తి, ఆయన సోదరి నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఈ అల్లర్ల కేసులో సంపత్‌రాజ్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఆందోళనకారులు దేవరా జీవనహళ్లి, కడుగొండనహళ్లిలోని పోలీస్‌స్టేషన్‌లపై కూడా దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనలను కట్టడి చేయడంతో భాగంగా బెంగళూరు నగర పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు పరారీలో ఉన్న సంపత్ రాజ్, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.