AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: చల్లారని అసంతృప్తి సెగలు.. జిల్లా అధ్యక్షుడిగా కాటసాని ప్రభావం చూపేనా..?

మంత్రివర్గ విస్తరణ అనంతరం కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలలో ఏర్పడిన ఆసమ్మతి సెగలు ఇంకా చల్లారడం లేదు. కర్నూలు జిల్లా నుంచి గుమ్మనూరు జయరాం, నంద్యాల జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ లను మంత్రివర్గంలో...

Kurnool: చల్లారని అసంతృప్తి సెగలు.. జిల్లా అధ్యక్షుడిగా కాటసాని ప్రభావం చూపేనా..?
Kurnool
Ganesh Mudavath
|

Updated on: Apr 21, 2022 | 1:52 PM

Share

మంత్రివర్గ విస్తరణ అనంతరం కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలలో ఏర్పడిన ఆసమ్మతి సెగలు ఇంకా చల్లారడం లేదు. కర్నూలు జిల్లా నుంచి గుమ్మనూరు జయరాం, నంద్యాల జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ లను మంత్రివర్గంలో కొనసాగించారు. వారికి అవే శాఖలను అప్పగించారు. ఇంతవరకు ఓకే.. కానీ జిల్లాలో మంత్రి పదవులు ఆశించిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పటికీ.. తనకు మంత్రిగా అవకాశం రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా అవకాశం వస్తుందని భావించినప్పటికీ అదీ జరగలేదు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కూడా అదే పరిస్థితి. తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల ఆయన అనుచరులలో అసంతృప్తి భగ్గుమంది. ఆత్మకూరులో కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. వారిని శిల్ప బుజ్జగించాల్సిన పరిస్థితి తలెత్తింది. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుంచి శ్రీశైలం నియోజకవర్గంలో చక్రపాణి రెడ్డి తనయుడు శిల్పా కార్తీక్ రెడ్డి తిరుగుతూ ఉండటం అంతటా చర్చనీయాంశమైంది.

వాస్తవానికి 2018 లో నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పట్లో అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలో చేరడం పట్ల శిల్పాపై సానుభూతి వ్యక్తమైంది. అయినప్పటికీ కూడా మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ అధిష్టానం సూచించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో కాటసాని రాంభూపాల్ రెడ్డికి నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబీకులు మంత్రివర్గంలో స్థానాన్ని ఆశించారు. వీరు ఐదుగురు అన్నదమ్ములు లో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు గా ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. తీరా తమ పేరు లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు కానీ ఎక్కడా బయట పడలేదు. ఎందుకంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మరో సోదరుడు శివరాం రెడ్డికి ఎమ్మెల్సీగా జగన్ అవకాశం ఇవ్వడంతో అసంతృప్తిని ఎక్కడ వ్యక్తం చేయలేదు. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ అనేది లేని అసంతృప్తిని ఎమ్మెల్యేలలో వ్యక్తం చేసేలా చేసిందనేది వాస్తవం.

Also Read

Boris Johnson: సబర్మతి ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని.. నూలు వడికిన బోరిస్ జాన్సన్..

Ramnami Tribe: ఈ గిరిజన తెగ రామ భక్తికి సాటి ఎవరు?.. వందల ఏళ్లుగా వళ్లంతా రామ నామంతో పచ్చ బొట్లు..

Plane Crash: హైతిలో సోడా బాటిళ్ల ట్రక్కును ఢీ కొన్న చిన్న విమానం.. ఐదుగురు మృతి.. ప్రధాని సంతాపం