Wanaparthy: పుష్పను మించిన లావణ్య.. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని భర్తకు చెప్పి..
వనపర్తి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని చెప్పి.. భర్తనే బలి చేసింది ఓ ఇల్లాలు. ప్రియుడితో చెప్పి కట్టుకున్న భర్తనే ఖతం చేయించింది.
Telangana: వనపర్తి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని చెప్పి.. భర్తనే బలి చేసింది ఓ ఇల్లాలు. ప్రియుడితో చెప్పి కట్టుకున్న భర్తనే ఖతం చేయించింది. ఆపై ఇంట్లో ఉన్న 30 లక్షలు తీస్కోని.. ప్రియుడితో కలిసి చెక్కేసింది. క్రైమ్ జరిగిన 3 నెలల తర్వాత అమ్మగారి బాగోతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తిలోని గాంధీనగర్‌కు చెందిన మేస్త్రీ బాలస్వామి (39)కి లావణ్యతో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు. కాగా లావణ్యకు నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. భార్యభర్తల మధ్య డైలీ గొడవలు జరిగేవి. కాగా 5 నెలల క్రితం బాలస్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి. భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకుని.. ఆ డబ్బు తీసుకుని ప్రియుడు నవీన్‌తో చెక్కేయాలని ప్లాన్ చేసింది. దగ్గర్లోని మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, సమస్యలు అన్నీ పోయి.. కాపురం సవ్యంగా సాగుతుందని నమ్మించింది. జనవరి 21న అర్ధరాత్రి ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపింది. ఈ విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. అప్పటికే వేచి ఉన్న నవీన్, సుపారీగ్యాంగ్‌తో గొంతు నులిమి చంపేశారు. కందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతడి సెల్‌ఫోన్‌ను పడేశారు. బంగారి అనే వ్యక్తి సాయంతో డెడ్‌బాడీని హైదరాబాద్‌లోని బాలాపూర్ శివారుకు తీసుకెళ్లి పాతిపెట్టారు.
బాలస్వామి ఆచూకి దొరకకపోవడం, ఫోన్ కూడా కలవకపోవడంతో అతడి తమ్ముడు రాజు.. జనవరి 22న పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ మర్నాటి నుంచి లావణ్య కూడా కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సెర్చింగ్ ప్రారంభించిన పోలీసులు లావణ్య, నవీన్‌లను బుధవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగుచూసింది. హత్యకు సహకరించిన కురుమూర్తి, గణేశ్, బంగారిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ శివారులో పూడ్చిపెట్టిన బాలస్వామి మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. హత్యకు సుపారీ గ్యాంగ్ రూ.2 లక్షలు తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది.
Also Read: Viral: నిమ్మకాయల రేట్లు తగ్గాలని ‘తంత్ర పూజ’.. ఏం బలి ఇచ్చారో తెలిస్తే ఫ్యూజులు ఔట్