‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

టైటిల్ : ‘కౌసల్య కృష్ణమూర్తి’ తారాగణం : ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌ తదితరులు సంగీతం : దిబు నిన్నాన్‌ థామస్‌ నిర్మాతలు : కేఎ వల్లభ కథ : అరుణ్‌రాజా కామరాజ స్క్రీన్ ప్లే, దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు విడుదల తేదీ: 23-08-2019 రీమేక్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్టైన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. తాజాగా మరో తమిళ రీమేక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. హీరోయిన్ ఐశ్వర్య […]

'కౌసల్య కృష్ణమూర్తి' మూవీ రివ్యూ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2019 | 3:38 PM

టైటిల్ : ‘కౌసల్య కృష్ణమూర్తి’

తారాగణం : ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌ తదితరులు

సంగీతం : దిబు నిన్నాన్‌ థామస్‌

నిర్మాతలు : కేఎ వల్లభ

కథ : అరుణ్‌రాజా కామరాజ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు

విడుదల తేదీ: 23-08-2019

రీమేక్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్టైన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. తాజాగా మరో తమిళ రీమేక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనా’ సినిమాను ‘కౌసల్య కృష్ణమూర్తి పేరుతో రూపొందించాడు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ ‘కనా’ను కౌస‌ల్య గుర్తుకు తెచ్చిందా?  లేదా అనేది ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

రైతు కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కి వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో.. క్రికెట్ అన్నా కూడా అంతే ఇష్టం. టీమిండియా మ్యాచ్ ఓడిపోతే అసలు తట్టుకోలేడు. సరిగ్గా తండ్రి మాదిరిగానే చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకుంటుంది కౌసల్య(ఐశ్వ‌ర్య రాజేష్‌). ఇండియా త‌ర‌పున ఆడి, క‌ప్పు గెలిచి తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నుకుంటుంది. అయితే వాళ్ళ అమ్మ (ఝాన్సీ) మాత్రం మ‌గ‌పిల్ల‌ల‌తో ఆట‌లేంటి? ఊళ్ళో వాళ్ళు సూటిపోటి మాటలు అంటారు.. తమ పరువు పోతుందంటూ కఠువుగా మాట్లాడుతుంది. ఎవరెన్ని మాటలు అన్నా.. కౌసల్య క్రికెటర్ కావడానికి సన్నధం అవుతుంది. మ‌రి ఆమె తను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించిందా, లేదా? త‌న తండ్రి ఆనందం కోసం త‌న ల‌క్ష్యం కోసం కౌస‌ల్య ఎన్నికష్టాలు ప‌డింది? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి మాట్లాడితే.. క్రికెటర్ పాత్ర కోసం ఆమె పడిన కష్టం వెండితెరపై కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో చాలా ఈజ్‌తో నటించింది. రాజేంద్ర ప్ర‌సాద్ పాత్ర విధానం.. అందులో రాజేంద్రుడి నటన అద్భుతంగా ఉంది. ఝాన్సీ మరోసారి ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఇక చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన హీరో శివ కార్తికేయ‌న్ నటన.. ఆ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

విశ్లేష‌ణ‌ :

ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్న ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌ను ఏమాత్రం మిస్ చేయకుండా రీమేక్‌ను తెరకెక్కించారు. ఇక క్రికెట్‌ చుట్టూ కీలకమైన కథను దర్శకుడు మిక్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఓ అమ్మాయి క్రికెట‌ర్‌గా ఎదిగే తీరు, ఓ రైతు ప‌త‌నం.. ఇవి రెండూ ఒకే క‌థ‌లో ఇమిడ్చి, చివ‌ర్లో రైతుల్ని బ‌తికించండి, రైతుల్ని అప్పుల పాలు చేయొద్దు అంటూ మెసేజ్ ఇచ్చిన తీరు సగటు ప్రేక్షకుడికి నచ్చుతుంది. రైతు హత్యలు, క్రీడా నేపధ్యం మేళవించి చెప్పడం బాగుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా బాగుంది. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నచ్చుతాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • క‌థ‌, క‌థ‌నం
  • శివ‌ కార్తికేయ‌న్‌
  •  తండ్రీ కూతుళ్ల ఎమోష‌న్‌

మైనస్‌ పాయింట్స్‌ :

  • తమిళ ఫ్లేవర్

వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు