కర్నూలు జిల్లాలో దారుణం.. పొలంలో రైతును నరికి చంపిన దుండగులు.. పాత కక్షలే కారణమంటున్న కుటుంబసభ్యలు

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పొలానికి వెళ్లిన ఓ రైతును గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు.

కర్నూలు జిల్లాలో దారుణం.. పొలంలో రైతును నరికి చంపిన దుండగులు.. పాత కక్షలే కారణమంటున్న కుటుంబసభ్యలు
Follow us

|

Updated on: Nov 26, 2020 | 11:23 AM

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పొలానికి వెళ్లిన ఓ రైతును గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. కోసిగి మండలంలోని కోలమాన్‌పేట గ్రామానికి చెందిన బోయ కిందింటి గోవిందు(55) పొలంలో దారుణ హత్యకు గురయ్యారు. పొలంలో పత్తి కోతలకు గోవిందు, తన భార్య తిక్కమ్మ, కుమార్తెతో కలిసి వెళ్లారు. సాయంత్రం కాగానే భార్య, కుమార్తెలను ఇంటికి పంపిన కాసేపట్లో వస్తానని చెప్పాడు గోవిందు. చీకటి పడుతున్నా.. ఎంతసేపటికీ గోవిందు ఇంటికి రాకపోవడంతో పెద్దకుమారుడు వెంకటేశ్‌ పొలానికి వెళ్లి చూడగా తండ్రి తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో విగత జీవిలా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోవిందు భార్య వైసీపీలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పాత కక్షలతోనే తన భర్తను హత్య చేసి ఉంటారని భార్య ఆరోపించారు. గోవిందుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. హత్య జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

Latest Articles
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!