ఆ వీధి కుక్క ఇప్పుడు పేరు మోసిన బాంబ్ స్క్వాడ్

ఓ వీధి కుక్క ఇప్పుడు టాప్ బాంబ్ స్క్వాడ్‌గా పేరొందింది. తనను రక్షించిన పోలీసుల రుణం తీర్చుకునేందుకు త్వరలో అధికారిక బాంబ్ స్వ్కాడ్‌లోకి వెళ్లి సేవలు అందించబోతోంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం బర్రాక్‌పోర్ క్యాంపస్ దగ్గర ఓ వీధి కుక్క తీవ్ర రక్తస్రావంతో నిస్సాహాయస్థితిలో పడి ఉంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు పోలీసులు ఆ కుక్కను తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అంతేకాదు దానికి ఆశ అనే నామకరణం చేసి […]

ఆ వీధి కుక్క ఇప్పుడు పేరు మోసిన బాంబ్ స్క్వాడ్
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 9:40 AM

ఓ వీధి కుక్క ఇప్పుడు టాప్ బాంబ్ స్క్వాడ్‌గా పేరొందింది. తనను రక్షించిన పోలీసుల రుణం తీర్చుకునేందుకు త్వరలో అధికారిక బాంబ్ స్వ్కాడ్‌లోకి వెళ్లి సేవలు అందించబోతోంది.

వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం బర్రాక్‌పోర్ క్యాంపస్ దగ్గర ఓ వీధి కుక్క తీవ్ర రక్తస్రావంతో నిస్సాహాయస్థితిలో పడి ఉంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు పోలీసులు ఆ కుక్కను తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అంతేకాదు దానికి ఆశ అనే నామకరణం చేసి తమ దగ్గరే పెంపుడు జంతువుగా పెట్టుకున్నారు.

కాలక్రమంలో ఆశకు వాసనను పసిగట్టే గుణం బాగా ఉందని గుర్తించిన పోలీసులు దానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఒకటిన్నర సంవత్సరాల శిక్షణ అనంతరం ఆశకు డాగ్ స్వ్కాడ్‌లో స్థానం కల్పించారు. దాదాపు 30 జర్మన్ షెపర్డ్, లాబ్రోడర్స్ జాతి కుక్కలున్న ఆ బాంబ్ స్క్వాడ్ టీంలో ఆశ తన నేర్పరితనంలో బలమైన కుక్కగా స్థానం సాధించింది.

దీని గురించి పశ్చిమ బెంగాల్ పోలీస్ ట్రైనింగ్ ఆఫీసర్ దినకరన్ బట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘ఆశ గ్లాస్‌ను బద్దలు కొట్టగలదు. అధికారిక డాగ్ స్వ్కాడ్‌లో ఆశ ఒక్కటే వీధి కుక్క. మనం పెంచుకునే కుక్కలే కాదు వీధి కుక్కలు కూడా వాసనను బాగా పనిగట్టగలవని ఆశ నిరూపించింది’’ అంటూ పేర్కొన్నారు. కాగా ఆర్డీఎక్స్, టీఎన్‌టీ, గెలటైన్ వంటి బాంబ్‌లను ఆశ ఇట్టే పసిగట్టిగలదు.