Heart Attack: గుండెపోటు రాకుండా అద్భుతమైన చిట్కా.. డైలీ ఇలా చేస్తే తిరుగుండదు.. మీరూ ట్రై చేయండి..

ఆరోగ్యంగా ఉండటానికి శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం.. ఇందులో వ్యాయామం, యోగా మాత్రమే కాకుండా చిన్న చిన్న రోజువారీ అలవాట్లు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ అలవాట్లలో ఒకటి మెట్లు ఎక్కడం.. అవును, మీరు సరిగ్గానే చదివారు..

Heart Attack: గుండెపోటు రాకుండా అద్భుతమైన చిట్కా.. డైలీ ఇలా చేస్తే తిరుగుండదు.. మీరూ ట్రై చేయండి..
Heart Attack
Follow us

|

Updated on: Jul 24, 2024 | 8:32 PM

ఆరోగ్యంగా ఉండటానికి శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం.. ఇందులో వ్యాయామం, యోగా మాత్రమే కాకుండా చిన్న చిన్న రోజువారీ అలవాట్లు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ అలవాట్లలో ఒకటి మెట్లు ఎక్కడం.. అవును, మీరు సరిగ్గానే చదివారు.. మెట్లు ఎక్కడం మీ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుంది.. అయితే గుండె దృఢంగా ఉండటానికి గుండెపోటును నివారించడానికి ఉత్తమ మార్గం ప్రతిరోజూ మెట్లు ఎక్కడం.. అయితే.. రోజూ ఎన్ని మెట్లు ఎక్కాలి..? అధ్యయనం ఏం చెప్పింది..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోండి..

ప్రతిరోజూ ఎన్ని మెట్లు ఎక్కాలి

గుండెపోటును నివారించడానికి మార్గం.. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం ఉత్తమమని దీనిద్వారా గుండె సిరలు బలంగా మారడం ప్రారంభమవుతుందని తులనే విశ్వవిద్యాలయం అధ్యయనం పేర్కొంది. తులనే విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 50 మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెట్లు ఎక్కే వారికి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువ. జిమ్‌కి వెళ్లడానికి లేదా ఎక్కువసేపు నడవడానికి మీకు సమయం దొరకకపోయినా, భయపడాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం స్పష్టంగా సూచిస్తుంది. మీరు సులభమైన మార్గాల్లో మీ హృదయాన్ని కూడా భద్రంగా చూసుకోవచ్చని పరిశోధనలో తెలిపింది.

మెట్లు ఎక్కడం వల్ల గుండెకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది..?

మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌గా పిలువబడే హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) స్థాయి పెరుగుతుందని అధ్యయనం కనుగొంది. మరోవైపు, డర్టీ కొలెస్ట్రాల్ అని పిలువబడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) స్థాయి తగ్గుతుంది. దీని వల్ల గుండెలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

గుండెపోటుతో పాటు ఊబకాయం కూడా దూరమవుతుంది..

ఆఫీస్ లాంటి ప్రదేశాలల్లో మీరు లిఫ్ట్‌కి బదులుగా మెట్లను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే, మీరు మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. కానీ ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ కీళ్లను, ఎముకలను కూడా బలపరుస్తుంది.

కేవలం మెట్లు ఎక్కడం వల్ల గుండెపోటు రాకుండా ఉండదు..

కేవలం మెట్లు ఎక్కితే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. అలాగే ధూమపానం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..