AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేకే కథ కల్లాస్! పరిణామాల అంతరార్థం అదే!!

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే వరకు టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా వున్న రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కథ కంచికేనా? తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితిలో జరుగుతున్న చర్చ నిజమే అయితే.. కేకే కథ ఇక ముగిసినట్లేనని తెలుస్తోంది. కేకే ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కాకలు తీరిన లీడర్‌. తెలంగాణ ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు. ఆతర్వాత పెద్దల సభకు వెళ్లారు. హస్తిన రాజకీయాలకు పరిమితమయ్యారు. అలాంటి నేత ఇప్పుడు మళ్లీ ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కే యోగం […]

కేకే కథ కల్లాస్! పరిణామాల అంతరార్థం అదే!!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jun 23, 2021 | 10:52 AM

Share

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే వరకు టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా వున్న రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కథ కంచికేనా? తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితిలో జరుగుతున్న చర్చ నిజమే అయితే.. కేకే కథ ఇక ముగిసినట్లేనని తెలుస్తోంది.

కేకే ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కాకలు తీరిన లీడర్‌. తెలంగాణ ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు. ఆతర్వాత పెద్దల సభకు వెళ్లారు. హస్తిన రాజకీయాలకు పరిమితమయ్యారు. అలాంటి నేత ఇప్పుడు మళ్లీ ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కే యోగం ఉందా? లేదా? అనే ప్రచారం మొదలైంది.

తెలంగాణ నుంచి పెద్దల సభకు నేతలెవరు? తెలంగాణ కోటాలో రాజ్యసభకు వెళ్లే ఆ పెద్దలెవరు? అనే చర్చ మొదలైంది. ఈ సారి సామాజిక సమీకరణలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఢిల్లీ వెళ్లే యోగం ఎవరికీ ఉందనే చర్చ టీఆర్‌ఎస్‌లో నడుస్తోంది.

తెలుగు రాష్ట్రాల నలుగురు రాజ్యసభ సభ్యులు కేకే, కేవీపీ, ఎం.ఏ ఖాన్‌, గరికపాటిమోహన్‌రావుల పదవీకాలం మార్చితో ముగుస్తోంది.. కేకే, ఎం.ఏ ఖాన్‌ టెక్నికల్‌గా తెలంగాణకు చెందిన వారైనా ఆంధ్రకోటాలో ఉన్నారు. కేవీపీ, గరికపాటి ఇద్దరూ తెలంగాణ కోటాలో కొనసాగుతున్నారు. దీంతో సాంకేతికంగా ఎలా ఉన్నా…తెలంగాణకు వచ్చే రెండు రాజ్యసభ పదవులు తెలంగాణ రాష్ట్ర సమితికే దక్కనున్నాయి.

టీఆర్‌ఎస్‌కు దక్కే ఈ రెండు స్థానాల నుంచి పెద్దల సభకు ఎవరూ వెళతారు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేకే మరోసారి సెద్దల సభకు వెళతారా? అనేది ఇంట్రెస్టింగ్‌ మారింది కేకే ఇప్పటికే ఒకసారి రాజ్యసభకు వెళ్లారు. దీంతో మరోసారి ఆయన్ని పెద్దలసభకు కేసీఆర్‌ పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత కేకేకు ఉన్న సెక్రటరీ జనరల్‌ పోస్టు మనుగడలో ఉన్నట్లా? లేనట్లా? అనేది స్పష్టత లేని అంశంగా మారింది. ఇప్పటివరకూ తెలంగాణభవన్‌లో ఆయనకు సెపరేటుగా ఉన్న గదిని కూడా తొలగించారు. ఇప్పుడు రాజ్యసభ రెన్యువల్‌ అయినా ఉంటుందా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఆయనకు రాష్ట్రంలోనే సలహాదారుడి పదవి లేకపోతే పదవి ఇచ్చి ఇక్కడే సేవలు వినియోగించుకుంటారా? అనే చర్చ కూడా నడుస్తోంది.

ఒక వేళ రెండు సీట్లలో ఒకటి కేకే ఇస్తే…. మరొకటి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఇస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇప్పటివరకూ రాజ్యసభ సీటు రెడ్డి వర్గానికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇస్తారని అందరూ భావిస్తున్నారు. ఇక కేకేకు తిరిగి అవకాశం కల్పించకపోతే కవితకు పెద్దల సభ్యత్వం వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది.