ఒక్క సెట్ కోసం రూ.5 కోట్లా రౌడీ హీరో..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14 న తెరపైకి రానుంది. ఈ చిత్రం విజయవంతం కావడానికి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. హిట్ టాక్ వస్తే..విజయ్‌కి ఈ అమౌంట్ పెద్ద విషయం కాదు. సినిమా, సినిమాకి హిట్టూ..ప్లాపుతో సంబంధం లేకుండా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు రౌడీ హీరో. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూర్తి చేసిన అనంతరం విజయ్ తిరిగి ముంబైకి వెళ్లి దర్శకుడు పూరి […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14 న తెరపైకి రానుంది. ఈ చిత్రం విజయవంతం కావడానికి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. హిట్ టాక్ వస్తే..విజయ్‌కి ఈ అమౌంట్ పెద్ద విషయం కాదు. సినిమా, సినిమాకి హిట్టూ..ప్లాపుతో సంబంధం లేకుండా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు రౌడీ హీరో.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూర్తి చేసిన అనంతరం విజయ్ తిరిగి ముంబైకి వెళ్లి దర్శకుడు పూరి జగన్నాధ్ ‘ఫైటర్’ షూటింగ్‌ని షురూ చేయనున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేశాడు పూరి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా చిత్రంలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ కోసం ముంబైలో 5 కోట్లతో భారీ సెట్ ఏర్పాటు చేస్తుందట టీం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీని హిందీలో ఏస్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అందుకే ఖర్చుకి ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదట మేకర్స్. పూరి అంటే పక్కా మాస్..ప్రస్తుతం విజయ్ దేవరకొండ కేరాఫ్ మాస్ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఇక వీరిద్దరూ కలిశారంటే ఆ రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. దీంతో వీరిద్దరి కాంబోలో పక్కా మాస్ ఎంటర్టైనర్ వస్తుందన్న విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. లెట్స్ వెయిట్ అండ్ సి.