కువైట్‌ రాజు షేక్‌ సబ అల్‌ అహ్మద్ కన్నుమూత

అనారోగ్యంతో బాధపడుతున్న కువైట్‌ రాజు షేక్‌ సబ అల్‌ అహ్మద్ ‌(91) కన్నుమూశారు. ఈ విషయాన్ని అమిరీ దివాన్‌ డిప్యూటీ మినిస్టర్‌ షేక్‌ అలీ అల్‌ జర్రా అల్‌ సబ తెలిపారు.

కువైట్‌ రాజు షేక్‌ సబ అల్‌ అహ్మద్ కన్నుమూత
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 29, 2020 | 9:29 PM

అనారోగ్యంతో బాధపడుతున్న కువైట్‌ రాజు షేక్‌ సబ అల్‌ అహ్మద్ ‌(91) కన్నుమూశారు. ఈ విషయాన్ని అమిరీ దివాన్‌ డిప్యూటీ మినిస్టర్‌ షేక్‌ అలీ అల్‌ జర్రా అల్‌ సబ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం జులై 18న అమిర్‌ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయన జూలై 23న అమెరికా వెళ్లి వైద్య చికిత్స తీసుకున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచే వారసుడిగా షేక్‌ నవాఫ్‌ అహ్మద్‌ అల్‌ సబ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు.షేక్‌ సబ అల్‌ అహ్మద్‌ జనవరి 29, 2006లో అమిర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అంతకముందు ఆయన సోదరుడు, కువైట్‌కు రాజుగా ఉన్న షేక్‌ జబర్‌ అల్‌ అహ్మద్‌ అల్ సబ ఈయన్ను 2003లో ప్రధానమంత్రిగా నియమించారు. దీంతో అల్‌ సబా రాజవంశం నుంచి షేక్‌ సబ అల్‌ అహ్మద్‌ 15వ పారిపాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు 1963 – 2003 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు 40 ఏండ్ల అనుభవం కూడా ఉంది. ఈ సమయంలోనే కువైట్‌ విదేశాంగ విధానం రూపకల్పనలో అల్‌ అహ్మద్ కీలక పాత్ర పోషించారు. అరబ్‌ ప్రపంచంలో ప్రముఖ దౌత్యవేత్తల్లో ఒకరికగా, గొప్ప మానవతావాదిగా మన్ననలు అందుకున్నారు అల్‌ అహ్మద్.