AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TBJP: మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి షాక్.. ఎన్నికలవేళ పార్టీని వీడుతున్న కీలక నేతలు

ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ పార్టీకి షాక్ లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. పార్టీని వీడవద్దని బీజేపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులు అసలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది.

TBJP: మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి షాక్.. ఎన్నికలవేళ పార్టీని వీడుతున్న కీలక నేతలు
Bjp
P Shivteja
| Edited By: |

Updated on: Apr 15, 2024 | 2:05 PM

Share

ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ పార్టీకి షాక్ లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. పార్టీని వీడవద్దని బీజేపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులు అసలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ పార్టీ నేతలు షాక్ కి గురయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న పులి మామిడి రాజు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. పులిమామిడి రాజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి వెళ్లిన పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

సంగారెడ్డి బీజేపీ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న పులిమామిడి రాజు కాంగ్రెస్‌లో చేరడంతో సంగారెడ్డి సెగ్మెంట్‌తో పాటు జిల్లాలో కూడా బీజేపీపై తీవ్ర ప్రభావం పడుతుంది అని, ఆ పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. మరో వైపు బీసీ సామాజిక వర్గంలోని ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి పులిమామిడి రాజు.. సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడిగా పేరు ఉన్న రాజు ఆ పార్టీని వీడడం బీజేపీకి నష్టమే అని అంటున్నారు సీనియర్ లీడర్ల్. పులిమామిడి రాజు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని ఎవరు ఉహించలేదట. ఇంత సడన్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు అనేది ఎవరికి అర్ధం కావడం లేదట.

ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న పులిమామిడి రాజు కాంగ్రెస్‌లో చేరడం అనేది బీజేపీ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి..మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజు..ఆ పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేదు అని, బీజేపీ పార్టీలో చేరి సంగారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ఓడిపోయాడు..రాజుకు మొన్న జరిగిన ఎన్నికల్లో 25000 ఓట్లు వచ్చాయి..గతంలో ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులకు 16000 ఓట్లు మాత్రమే వచ్చాయి..పులిమామిడి రాజు బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి సంగారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ క్యాడర్ లో కొత్త జోష్ వచ్చినట్లు అయ్యింది..కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే అతన్ని ఇబ్బందులకు గురి చేశారు అని సమాచారం

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం