ITR Filing: ఈ ఫారం చాలా కీలకం.. ట్యాక్స్ పేయర్స్ దీని గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే..

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో ఫారమ్ 26 ఏఎస్ చాలా కీలకంగా ఉంటుంది. ఇది ఐటీ శాఖ అందించిన సమగ్ర పన్ను క్రెడిట్ స్టేట్‌మెంట్‌గా ఉపయోగపడుతుంది. మీ యజమాని, బ్యాంక్, ఇతరుల ద్వారా మీ ఆదాయం నుంచి కట్టిన వివిధ పన్నులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. పన్ను రూపంలో మీ తరపున ప్రభుత్వానికి కట్టిన ఆదాయాన్ని చూపిస్తుంది.

ITR Filing: ఈ ఫారం చాలా కీలకం.. ట్యాక్స్ పేయర్స్ దీని గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే..
Income Tax
Follow us
Madhu

|

Updated on: Apr 15, 2024 | 2:26 PM

ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించేటప్పుడు చాలా విషయాలను గమనించాలి. మీ ఆదాయం, వ్యయాలు, మినహాయింపులు, టీడీఎస్ తదితర వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకోసం మీకు ఫారం 26 ఏఎస్ చాలా ఉపయోగపడుతుంది. దానిని గమనించి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. ఫారం 26ఏఎస్ లో మీ ఆదాయంతో పాటు మీరు చెల్లించిన టీడీఎస్ అంటే పన్నుల వివరాలు కూడా ఉంటాయి. దానివల్ల మీ ట్యాక్స్ లెక్కింపు సులభమవుతుంది.

ఫారం 26ఏఎస్ చాలా కీలకం..

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో ఫారమ్ 26 ఏఎస్ చాలా కీలకంగా ఉంటుంది. ఇది ఐటీ శాఖ అందించిన సమగ్ర పన్ను క్రెడిట్ స్టేట్‌మెంట్‌గా ఉపయోగపడుతుంది. మీ యజమాని, బ్యాంక్, ఇతరుల ద్వారా మీ ఆదాయం నుంచి కట్టిన వివిధ పన్నులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. పన్ను రూపంలో మీ తరపున ప్రభుత్వానికి కట్టిన ఆదాయాన్ని చూపిస్తుంది.

లావాదేవీల వివరాలు..

మూలం వద్ద తీసివేయబడిన, సేకరించిన, ముందస్తు, స్వీయ అంచనా తదితర పన్నులు, ఆర్థిక లావాదేవీల పూర్తి సమాచారం మీ పాన్ కార్డు ద్వారా ఫారం 26 ఏఎస్ లో నమోదు చేస్తారు. ఉదాహరణకు మీ జీతం, ఇంటి నుంచి వచ్చే అద్దె, బ్యాంకులో డిపాజిట్లపై వడ్డీ తదితర వాటికి టీడీఎస్ కట్ చేస్తారు. మీరు ఏదైనా ఆస్తిని అమ్మితే దానిపై టీడీఎస్ కట్ చేసుకుని మిగిలిన డబ్బులు మీకు జమచేస్తారు. మీరు బ్యాంకు ఖాతా ద్వారా పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఆ వివరాలన్నీ నమోదవుతాయి. ఇవన్ని ఫారం 26 ఏఎస్ లో స్పష్టం ఉంటాయి.

ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో..

ఫారం 26 ఏఎస్ అనేది ఆదాయపు పన్ను శాఖ తయారు చేస్తుంది. పన్ను చెల్లింపు దారులు ఆ శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ ఫారం ప్రకారం ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మూలం వద్ద మినహాయించిన పన్ను (టీడీఎస్), మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్), ముందస్తు పన్ను లేదా స్వీయ అసెస్‌మెంట్ పన్ను తదితర వాటి ద్వారా పన్నులు చెల్లింపులు జరుగుతాయి. వీటినన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ సక్రమంగా లెక్కించి, మొత్తం పన్ను డేటాబేస్ ను నిర్వహిస్తుంది. ఫారం 26 ఏఎస్ లో తెలిపిన పన్నుల క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఐటీఆర్ లో వీలుంటుంది.

ఫారం 26 ఏఎస్ ఎవరికి అవసరం?

పాన్ కార్డు కలిగి, ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల ఆదాయం పొందిన వారందరికీ ఫారం 26 ఏఎస్ అవసరం. ఆ ఆదాయం ఈ విధంగా ఉండొచ్చు..

  • జీతం లేదా పెన్షన్
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాపై వడ్డీ
  • అద్దె
  • మూలధన లాభాలు
  • డివిడెండ్లు
  • టీడీఎస్ ద్వారా మినహాయించబడిన పన్ను

డౌన్‌లోడ్ చేసుకునే విధానం

  • ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • మీ ఐడీని నమోదు చేయండి. అది మీ పాన్ లేదా మీ ఆధార్ నంబర్ కావచ్చు.
  • మీ పాస్ వర్డ్ నమోదుచేయండి.
  • మీరు లాగిన్ అయిన తర్వాత ప్రధాన స్క్రీన్ కనిపిస్తుంది.
  • అక్కడి మెనూ నుంచి ఇ-ఫైల్ విభాగానికి వెళ్లండి. ఆదాయ పన్ను రిటర్న్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. వెంటనే ఫారం 26 ఏఎస్ కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..