గుడ్ న్యూస్ చెప్పిన సైఫ్, కరీనా జంట

గుడ్ న్యూస్ చెప్పిన సైఫ్, కరీనా జంట

బాలీవుడ్ సెల‌బ్రిటీ‌ కపుల్ సైఫ్అలీ ఖాన్‌, కరీనా కపూర్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కరీనా త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

Ram Naramaneni

|

Aug 12, 2020 | 7:37 PM

Kareena Kapoor Khan pregnant : బాలీవుడ్ సెల‌బ్రిటీ‌ కపుల్ సైఫ్అలీ ఖాన్‌, కరీనా కపూర్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కరీనా త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ‘మా ఫ్యామిలీలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. మాపై ఎల్లప్పుడూ ప్రేమను చూపిస్తోన్న‌ శ్రేయోభిలాషులకు ధన్యావాదాలు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. సైఫ్‌, కరీనా 2012లో వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఈ క‌పుల్‌కు ఓ కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌ (3) ఉన్నాడు. ఈ బుడ‌త‌డు ఇప్పటికే సామాజిక మాద్య‌మాల్లో స్టార్‌ అయిపోయాడు. అత‌డికి సంబంధించిన ఏ కొత్త ఫొటో బయటికొచ్చినా లైక్‌లు, షేర్ల మోత మోగుతున్న విషయం విధిత‌మే.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu