లేడీ కానిస్టేబులా..మజాకా..ఆకతాయి వీపు చీరేసింది..
మహిళలపై అత్యాచారాలు, హత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు తెలంగాణ పోలీసులు. ఐనా పోకిరీలకు మాత్రం బుద్ధి రావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బాలికలను వేధిస్తున్న ఓ ఆకతాయికి దేహశుద్ది చేసింది ఓ మహిళా కానిస్టేబుల్. కాన్పూర్‌లోని బీతూర్‌లో స్కూల్‌కు వెళ్తున్న బాలికలను అసభ్య పదజాలంతో వేధిస్తూ వెంటపడుతున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఇది గమనించిన ఓ లేడీ కానిస్టేబుల్ అతన్ని పట్టుకొని వీపు […]

మహిళలపై అత్యాచారాలు, హత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు తెలంగాణ పోలీసులు. ఐనా పోకిరీలకు మాత్రం బుద్ధి రావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బాలికలను వేధిస్తున్న ఓ ఆకతాయికి దేహశుద్ది చేసింది ఓ మహిళా కానిస్టేబుల్.
కాన్పూర్‌లోని బీతూర్‌లో స్కూల్‌కు వెళ్తున్న బాలికలను అసభ్య పదజాలంతో వేధిస్తూ వెంటపడుతున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఇది గమనించిన ఓ లేడీ కానిస్టేబుల్ అతన్ని పట్టుకొని వీపు విమానం మోత మోగించేసింది. తన కాలి షూ తీసుకొని ఒళ్లు హూనం చేసింది. అతగాడి కాలర్ పట్టుకొని మరోసారి ఇలాంటి వెకిలి వేషాలు వేస్తే తాట తీస్తానంటూ హెచ్చరించింది. అనంతరం అతనిపై కేసు పెట్టి కటకటాల వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీతూర్ పోలీస్ స్టేషన్‌లో యాంటీ రోమియో స్క్వాడ్‌గా పనిచేస్తోంది చంచల్ చౌరాసియా. పోకిరీల భరతం పట్టే పనిలో ఉన్న ఈమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లేడీ కానిస్టేబులా..మజాకా అని కామెంట్స్ చేస్తున్నారు.
This is Kanpur Lady constable takes on a road side romeo, the eve teaser was taught a lesson, slaps, shoes and hope he has now understood that what he does is wrong.#DeepikaPadukone pic.twitter.com/cWRmgiyepA
— I Love Siliguri (@ILoveSiliguri) December 10, 2019