దిశ ఘటనపై కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రతీదీ..!
దిశ ఘటనపై కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ ధఫెదర్ శోభ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులతో దిశ సఖ్యతగా లేనట్టు కనిపిస్తోందని.. ఘటన జరిగిన రోజు ఆమె చెల్లెలికి కాకుండా.. తండ్రికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లేవారు కదా.. అంటూ జడ్పీ చైర్‌పర్సన్ ఇలా వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా.. దిశకు మద్దతుగా.. ఎన్నో నిరసనలు, పోరాటాలు జరిగితే.. జడ్పీ చైర్ పర్సన్ శోభ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి తావులేపుతోంది. […]

దిశ ఘటనపై కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ ధఫెదర్ శోభ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులతో దిశ సఖ్యతగా లేనట్టు కనిపిస్తోందని.. ఘటన జరిగిన రోజు ఆమె చెల్లెలికి కాకుండా.. తండ్రికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లేవారు కదా.. అంటూ జడ్పీ చైర్‌పర్సన్ ఇలా వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా.. దిశకు మద్దతుగా.. ఎన్నో నిరసనలు, పోరాటాలు జరిగితే.. జడ్పీ చైర్ పర్సన్ శోభ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి తావులేపుతోంది.
తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేకపోవడంతోనే… దిశ చెల్లెలెకి ఫోన్ చేసింది.. అయినా గెజిటెడ్ అధికారిగా ఉన్న ఆమెకు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలీదా..? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని పడితే వారిని నమ్మకూడదని.. వారు చేసిన చిన్న తప్పులే.. ఇలాంటి ఘటనలకు దారి తీస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎంత మంది పిల్లలను కాపాడుతుంది.. ప్రతీదీ ప్రభుత్వంపై రుద్దడం సరికాదన్నారు. మహిళ శిశు సంక్షేమ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ విధంగా కామెంట్స్ చేశారు.



