AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై కేసు నమోదు.. అరెస్ట్‌కి రంగం సిద్దం!

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్‌లో తిరిగొచ్చిన నటుడు అర్హన్ ఖాన్.. గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. షెఫాలీ బగ్గా, మధురిమ తులితో పాటు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన అతడు.. వచ్చీరాగానే రష్మీ దేశాయ్‌కి లవ్ ప్రపోజ్ చేశాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. సల్మాన్ ఖాన్ వీకెండ్‌లో అర్హన్ గతం గురించి మొత్తం రష్మీకి చెప్పడంతో ఆమెతో పాటు హౌస్‌మేట్స్ కూడా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా అర్హన్ ఖాన్‌పై […]

బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై కేసు నమోదు.. అరెస్ట్‌కి రంగం సిద్దం!
Ravi Kiran
|

Updated on: Dec 11, 2019 | 6:05 PM

Share

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్‌లో తిరిగొచ్చిన నటుడు అర్హన్ ఖాన్.. గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. షెఫాలీ బగ్గా, మధురిమ తులితో పాటు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన అతడు.. వచ్చీరాగానే రష్మీ దేశాయ్‌కి లవ్ ప్రపోజ్ చేశాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. సల్మాన్ ఖాన్ వీకెండ్‌లో అర్హన్ గతం గురించి మొత్తం రష్మీకి చెప్పడంతో ఆమెతో పాటు హౌస్‌మేట్స్ కూడా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా అర్హన్ ఖాన్‌పై ఫ్రాడ్ కేసు రిజిస్టర్ అయింది. అర్హన్ ఖాన్ మాజీ ప్రేయసి అమ్రితా ధనోయా ఓషివారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. తనకు చెల్లించాల్సిన బకాయిలు కట్టలేదని ఆమె పేర్కొంది.

అర్హన్ తనతో ఐదేళ్లుగా సహజీవనం చేశాడని.. శారీరికంగా, మానసికంగా, ఆర్ధికంగా తనను ఎంతగానో మోసం చేశాడంటూ అమ్రితా కేసు పెట్టింది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు తన దగ్గర నుంచి అర్హన్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడని ఆరోపించింది. మరోవైపు ఇదే తరహాలో ఇతర నటీమణులను కూడా అర్హన్ మోసం చేశాడని అమ్రితా లిఖితపూర్వక ఫిర్యాదులో నమోదు చేసింది.  కాగా, అర్హన్ ఖాన్ అసలు పేరు మజ్హర్ షేక్ అని స్పష్టం చేసింది. అమ్రితా ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాక అర్హన్ ఖాన్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!